25-08-2025 01:26:13 AM
-రైతుల కలలు నీటిలో తేలిపోతున్నాయి
మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి
అశ్వాపురం, ఆగస్టు 24, (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపు రం మం డలంలోని కాకతీయుల కాలం నాటి చారిత్రాత్మ క సాగునీటి వనరైన తు మ్మల చెరువు ఈ సీజ న్లో వర్షాధారంతో 17 అడుగుల మేర నీటితో నిండిపోయింది. చెరువు నిండడంతో రైతులు ఆనం దం వ్యక్తం చేస్తుండగా, తూము షట్టర్ దెబ్బతినడం వల్ల నీటిని సక్రమంగా వాడుకోలేని స్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిపై మొండికుంట మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల కలలు నీటిలో తేలిపోతున్నాయి. చెరువు నిండినా పంటలకు నీళ్లు అందడం లేదు. ఎందుకంటే చెరువు పెద్ద తూము షట్టర్ పూర్తిగా దెబ్బతింది. ఇది కేవలం యంత్ర సమస్య కాదు, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వచ్చిన విపత్తు అని మల్లా రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం చెరువులను చూసుకోవడం మరిచిపోయింది. పర్యవేక్షణ లేకుండా వదిలేసింది. సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు ఎప్పుడు వస్తాయో దేవుడికే తెలుసు.
కానీ కనీసం యుద్ధ ప్రాతిపదికనైనా ప్రధాన తూము షట్టర్ వెంటనే ఏర్పాటు చేయాలి. లేదంటే ఈ చెరువు రైతులకు శాపంగా మారుతుంది అని గట్టిగా హెచ్చరించారు. ఎన్నికల సమయంలో రైతుల పేరుతో ఓట్లు అడుగుతారు. కానీ రైతులకు అవసరమైన చెరువులు, తూములు, కాల్వలపై చూపు సారించడం లేదు .రైతుల సమస్యలు ఎవరికీ కనపడవా?చెరువులు లేకుంటే పంటలు ఎలా పండు తాయి? అని ప్రభుత్వాన్నిప్రశ్నించారు.