25-08-2025 01:24:41 AM
గౌడసంఘం ఆధ్వర్యంలో వన భోజనాలు
టేకులపల్లి, (విజయక్రాంతి):టేకులపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రావణమాస వన భోజనాల కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గౌడ కులస్థులు ఇంటిల్లి పాది తరలివచ్చి బొజ్జాయిగూడెం సమ్మక్క-సారక్క గద్దెల దగ్గర లోని వనంలో గౌడ సంఘం నాయకులు చిర్రా వెంకటయ్య, గాడిపెళ్లి రాములు ఆధ్వర్యంలో ప్రకృతితో అనుబంధాన్ని పెంచుకోవడానికి తమ సభ్యులు ఐక్యత స్నేహభావంతో ఉండటానికి వనభోజన కార్యక్ర మాలు సభ్యులందరు కలసి చెట్ల నీడన దేవాలయాల వద్ద వన భోజనాలు చేసి సాంస్కృతిక కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు శ్రీ శైలం, వెంకన్న, గౌడ సంఘం కుటుంబ సభ్యులు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.