23 March, 2026 | 10:52 AM

అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది

23-03-2026 12:00 AM

మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి 

చెన్నూర్, మార్చి 22 : ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.ఆది వారం చెన్నూర్ నియోజక వర్గంలోనిక్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మున్సిప ల్ కమిషనర్ మారుతి ప్రసాద్, అధికారులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఇందులో భాగంగా క్యాతనపల్లి ము న్సిపాలిటీలో రూ. 200 కోట్ల  అంచనా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని 8, 9 వార్డులలో 13 లక్షల రూపాయలతో సిసి, శ్రీనివాస గార్డెన్ నుంచి అమ్మ గార్డెన్ వరకు 1 కోటి 80 లక్షల రూపాయలతో హైమాస్ లైట్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేశామన్నారు.

అమృత్ పథకంలో భాగంగా మందమర్రి మున్సిపల్ పరిధిలో 30 కోట్ల రూపాయలు, క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో 40 కోట్ల రూపాయలు, చెన్నూర్ మున్సిపల్ పరిధిలో 30 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయన్నారు. క్యాతనపల్లి, చెన్నూర్, మందమర్రి మున్సిపాలిటీలలోని అన్ని వార్డులలో అమృ త్ పథకం క్రింద త్రాగునీటిని అందిస్తు న్నా మని, డిఎంఎఫ్‌టి, సిఎస్‌ఆర్ నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలి పారు. అమృత్ 2.0 పథకం క్రింద 2 కోట్ల 9 లక్షల రూపాయలతో చెరువు సుం దరీకరణ పనులు చేపడుతున్నామని, 3 నెలలలో పను లు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సం బంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.