23 March, 2026 | 10:52 AM

ఈ కొనుగోలు ఎవరికోసం?

23-03-2026 12:00 AM

ఇప్పటికీ 50% రైతులు శనగ ధాన్యం విక్రయం 

ఆలస్య కొనుగోళ్లతో వ్యాపారులకి లాభం 

నిర్మల్, మార్చి 22 (విజయక్రాంతి): చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్నట్టు ఉం ది రైతుల పరిస్థితి. రబీలో శనగ పంటను పండించిన రైతులు మార్కెట్లో అమ్ముకున్న తర్వాత ప్రభుత్వం ఆలస్యంగా కొనుగోలను ప్రారంభిస్తుంది. ఇప్పటికి నిర్మల్ జిల్లాలో శనిగ పంట పండించిన రైతులు చెల్లికి ధాన్యాన్ని 50% పైగా ప్రైవేటు లో విక్రయించగా ప్రస్తుతం ప్రభుత్వ కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేయడం రైతుల కంటే వ్యాపారులకి లాభమని చర్చించుకుంటున్నారు.

నిర్మల్ జిల్లాలో భైంసా డివిజన్ లోని ము ధోల్, బాసర, లోకేశ్వరం, తానూర్, కుంటా ల, భైంసా, మండలంలోని వివిధ గ్రామాల్లో 47,982 ఎకరాల్లో రబీలో శనగ పంట సాగుచేసినట్టు అధికారులు తెలిపారు. నల్ల రేగడి భూముల్లో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ లో బోర్లు కింద చెరువుల కింద శనగ పం టను బాగు చేశారు. ఎకరానికి 7 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు చెప్తున్నారు. జిల్లాలో 8,445 మెట్రిక్ టన్నుల శనగ కొనుగోలను చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

సగం మంది రైతులు పంట అమ్మేశారు 

నిర్మల్ జిల్లాలో పంట సాగు చేస్తున్న రైతులు పంట చేతికి రావడంతో ఇప్పటికి ఇంట్లో నిల్వ చేయలేక ప్రభుత్వ కొనుగోలు ఉంటాయో లేదో అన్న బెంగతో శనిగ పంటలు ప్రైవేట్‌లో విక్రయించారు. ప్రభు త్వం శనగ పంటకు క్వింటాల్కు రూ. 5875 మద్దతు ధర ప్రకటించింది. అయితే ఫిబ్రవరి మాసంలోని శనగ పంట కోత బాసిన రైతులు యంత్రాల సాయంతో మూర్పిడి చేసి ఎండబెట్టి ప్రైవేటు దళారులకు విక్రయించారు.

ప్రైవేట్ లో క్వింటాలకు 5200 వరకు ధర చెల్లించడంతో వారు బైంసా మహారాష్ట్రలోని ధర్మబాత్ ప్రాంతాల్లో శనగ పంట విక్రయించారు. అయితే ప్రభుత్వం శనగ కొనుగోలు కోసం ప్రభుత్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలని జనవరిలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

ప్రభుత్వం కొనుగోళ్ల చేపడుతామని చెప్పినప్పటికీ ఆల స్యం కావడంతో పంటలు వికరించి ఎకరానికి 600 చొప్పున నష్టపోయారు. పంట చేతికొచ్చిన వెంటనే వెంటనే కొనుగోలు చేపడితే రైతులకు ప్రభుత్వ కొనుగోలపై భరోసా ఏర్పడి మద్దతు ధర దక్కిది. అయితే ఇప్పటికే చాలా మండలాలు 50% శనగ పంట ప్రైవేట్‌లో విక్రయించగా ఇప్పుడు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది.

జిల్లాలో బైంసా తానూర్ కుబీర్ బాసర ముధోళ్‌లో 5 కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేసి ఆదివారం రెండు కొనుగోలను ప్రారంభించింది. అయితే రైతులు అమ్ముకున్న తర్వాత పంట కొనుగోలు నిర్వహిం చడంపై రైతులు మండిపడుతున్నారు. ము ఖ్యంగా చిన్న రైతులు వ్యవసాయానికి పెట్టుబడి లేని రైతులు పంట అమ్ము కొన్న తర్వా త ఇప్పుడు కొనుగోలు చేపట్టడం దళారులకు లాభం ఉంటుందని అంటున్నారు.

రైతుల వద్ద కొనుగోలు చేసిన పంటను వ్యాపారులు దళారులు నిల్వ ఉంచి అదే పంటను రైతుల వద్ద నుంచి పాస్బుక్కులు సేకరించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించే విధంగా ఈ కొనుగోలు ఉపయోగ పడుతున్నాయని కొందరు రైతులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఆల స్యంగా కొనుగోలు చేయడం వల్ల రైతులకు జరగాల్సిన నష్టం జరగగా వ్యాపారులకు మాత్రం పంట పండించకుండా కొన్న పంట కు అదనంగా క్వింటాలుకు 600 అదనంగా ఆదాయం సమకూర్చే విధంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వ నిర్ణ యం పేద రైతులకు అన్యాయం చేయగా పెద్ద రైతులకు మాత్రం లాభాలను చేకూర్చడంతో చిన్న సన్నాక రైతులకు నష్టం జరిగి లబోది ఇవ్వమంటున్నారు 

కొనుగోళ్లలో అక్రమాలు లేకుండా చూస్తాం: మార్ఫెడ్ అధికారి 

నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కేంద్రంలో శనగ పంట పారదర్శకంగా కొనుగోలు చేస్తాం. ఆన్లైన్లో పంట నమోదు చేసుకొని పాస్ పుస్తకాలు ఉన్న రైతుల శనిగ కొనుగోలు మాత్రమే చేపడతాం. దళారుల శనిగా కొనుగోలపై ప్రత్యేక దృష్టి పెడతాం.