4 June, 2026 | 1:14 AM

పేదల సొంతింటి కలే ప్రభుత్వ లక్ష్యం

04-06-2026 12:21 AM

ఏఎంసీ వైస్ చైర్మన్ పవన్ కుమార్

నంగునూరు, జూన్ 3: పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభు త్వ లక్ష్యమని నంగునూరు ఏఎంసీ వైస్ చైర్మ న్ సాదుల పవన్ కుమార్ తెలిపారు.బుధవారం మండల పరిధిలోని తిమ్మాయిపల్లి లో కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. లబ్ధిదారులు మంత్రి వివేక్, సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణకు కృత జ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పం చ్ రాజు, ఏఎంసీ డైరెక్టర్ మహమ్మద్ ఇమ్రా న్, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.