12 July, 2026 | 3:14 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యం

23-06-2025 12:24 AM

దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి 

కొత్తకోట జూన్ 22 : తెలంగాణ రాష్టంలో ఉన్న రైతులను రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం కొత్తకోట, మదనపురం మండలాల శివార్లలోని భీమా ఫేజ్ 1 పంప్ హౌస్ నుండి వనపర్తి ఎమ్మెల్యే మేఘరెడ్డి, అధికారులతో కలసి దిగువకు నీటిని విడుదల చేశారు. 

ముందుగా గంగమ్మ తల్లికి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భీమా ఫేజ్ 1 పంప్ హౌస్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సకాలంలో వర్షాలు కురవడం వల్ల జూన్ నెలలోనే దిగువకు నీటిని విడుదల చేయడం జరిగిందని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం లో నిర్మించిన ప్రాజెక్టుల వల్లనే నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతాంగానికి సా గునీరు, తాగునీరు అందుతుందని తెలిపారు. రైతులు పంటలు వేసుకోవడానికి రైతు భరోసా నిధులు కూడా అందజేస్తుందని తెలిపారు. అదేవిదంగా పండించిన దాన్యానికి కూడా 500 బో నస్ డబ్బులు ఇస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లెపాగు ప్రశాం త్, మండల అధ్యక్షులు బిచుపల్లి యాదవ్, జిల్లా కార్యదర్శులు కృష్ణారెడ్డి, బోయోజ్, నరేందర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, గజ్జల నాగన్న, మహేష్, కృష్ణ, వెంకట్ నారాయణ, రవీందర్ రెడ్డి, మేస్త్రి శ్రీను తదితరులు పాల్గొన్నారు.