విద్యా, వైద్యరంగాలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి
సీపీఎం మండల కార్యదర్శి తోటకూరి రాజశేఖర్
కూసుమంచి, ఆగస్టు 24. ( విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగంపై ,వైద్యరంగంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని సిపిఎం మండల కార్యదర్శి తోటకూరి రాజశేఖర్ విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు హక్కుగా అందాల్సిన విద్య, వైద్యం రంగాన్ని ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తూ.. పేద ప్రజలకు విద్య వైద్యాన్ని దూరం చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పటల్ ను, పి ఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్ కూసుమంచి పాఠశాలను పరిశీలించారు.
ముందుగా ప్రభుత్వ ఆస్పటల్ కు చేరుకొని డాక్టర్ లక్ష్మి లోహిత ను ప్రజలకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి సిపిఎం బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్పిటల్లోనే ల్యాబ్ ,రోగులకు అందించే మందులు, రోగులకు అందించే వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే ప్రభుత్వ హాస్పిటల్ లో జనాభాకు తగ్గట్టుగా డాక్టర్లను నియమించి, వైద్య సిబ్బందిని పెంచి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ప్రభుత్వం డిమాండ్ చేశారు .అనంతరం మండల కేంద్రంలోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూసుమంచి ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రాయల వీరస్వామి తో మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, పాఠశాలకు వస్తున్న నిధులు, విద్యార్థులకు అందిస్తున్న విద్య, భోజన సదుపాయాలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు మల్లెల సన్మతరావు, డివిజన్ నాయకులు శీలం గురుమూర్తి,యడవల్లి రమణారెడ్డి, బిక్కసాని గంగాధర్, సిపిఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు కర్ణ బాబు, గన్య నాయక్, నాయకులు భూక్య నాగేశ్వరరావు పాల్గొన్నారు






