calender_icon.png 13 August, 2025 | 9:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా శ్రావణ మాస ఉప్పలమ్మ తల్లి బోనాలు..

11-08-2025 01:42:42 AM

ముషీరాబాద్, ఆగస్టు 10(విజయక్రాంతి):  గాంధీనగర్ డివిజన్  జవహర్ నగర్‌లోని లక్ష్మీ ఉప్పలమ్మ తల్లి దేవాలయంలో శ్రావణ మాసం బోనాలను నిర్వాహకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

బోనాల ని ర్వాహకులు వై. సంజీవ్‌రెడ్డి అతిథులు వినయ్ కుమార్‌ను సన్మానించి, అమ్మ వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బోనాల వేడుకల్లో బీజేపీ డివిజన్ అద్యక్షుడు నవీన్‌కుమార్ బీజేపీ నాయకులు సాయి కుమార్, జ్ఞానేశ్వర్, ఆలయ కమిటీసభ్యులు లక్ష్మి, పద్మావతి, రాధ, పవన్, అనిల్ కుమార్, కుమార్, సోనమ్, స్థానికులు నాయకులు  పాల్గొన్నారు.