calender_icon.png 13 August, 2025 | 9:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగరంగ వైభవంగా బంగారు మైసమ్మ తల్లి బోనాలు

11-08-2025 01:41:39 AM

కుత్బుల్లాపూర్, ఆగస్టు 10 (విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ భౌరంపేట్ లోని శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారి శ్రావణమాస బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజు మాట్లాడుతూ శ్రావణమాస బోనాల పండుగ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో భౌరంపేట్ పిఎసిఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, నిజాంపేట్ కార్పొరేటర్ బాలాజీ నాయక్, కౌన్సిలర్లు శంభీపూర్ క్రిష్ణ, బెంబడి బుచ్చిరెడ్డి, నాచారం మురళియాదవ్, విష్ణువర్ధన్‌రెడ్డి, అనంత స్వామి ముదిరాజ్, సాయి యాదవ్, షామీర్పేట్ హనుమంతరావు, కోర్ర శంకర్ నాయక్, 125 డివిజన్ బీఆర్‌ఎస్ ప్రెసిడెంట్ విజయ్ రాంరెడ్డి, పాక్స్ డైరెక్టర్లు అర్కల జీతయ్య, సత్తిరెడ్డి, మహిపాల్‌రెడ్డి, రమేష్ ముదిరాజ్, సీనియర్ నాయకులు ఎస్వి సురేందర్ రెడ్డి, ధర్మారెడ్డి, గోవింద్‌రెడ్డి, బాబు, రవీందర్ నాయక్, గోపాల్, బాలకృష్ణ, విష్ణు  తదితరులు పాల్గొన్నారు.