01-02-2026 02:41:28 AM
మేడారం, జనవరి 31 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర చరిత్రలో నిలిచిపోయే విధంగా విజయవం తంగా ముగిసిందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రి సీతక్క అన్నారు. భక్తులు ఎలాం టి అసౌకర్యాలు ఎదుర్కోకుండా తల్లులను ప్రశాంతంగా దర్శించుకోవడం ప్రభుత్వ యంత్రాంగం సాధించిన విజయంగా మం త్రి పేర్కొన్నారు. తల్లుల వన ప్రవేశం అనం తరం మేడారంలోని మీడియా సెంటర్‌లో మంత్రి సీతక్క మాట్లాడారు.
జాతర నిర్వహ ణకు ముందే రూపొం దించిన సమగ్ర ప్రణాళికలు, వ్యూహాలు, శాఖల మధ్య సమ న్వయంతో చేపట్టిన ఏర్పాట్లు పూర్తిస్థాయిలో ఫలించాయన్నారు. ఈ ఏడాది జాతరకు ప్ర త్యేక ఆకర్షణగా నూతనంగా చేపట్టిన అభి వృద్ధి పనులు ప్రత్యేకతగా నిలిచాయని చెప్పారు. గద్దెల పరిసరాల్లో విస్తరణ, పాద చారులకు సౌకర్య వంతమైన మార్గాలు, శాశ్వత మౌలిక వస తులు జాతర ప్రతిష్టను పెంచాయని చెప్పా రు.
ఈ మహాజాతరను విజయవంతం చేయ డంలో అహర్నిశలు కృషి చేసిన జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు, స్వచ్ఛం ద సంస్థలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ స్తులు, స్వచ్ఛంద సేవకులు, సహకరించిన ప్రతి ఒక్కరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో యుద్ధ ప్రాతిపదికన వంద రోజుల్లోనే మేడారం అభివృద్ధి పను లను పూర్తి చేశామన్నారు.
మేడారం చరిత్రలో సీఎం రేవంత్‌రెడ్డి పేరు చిరస్థా యిలో నిలిచిపోతుందన్నారు. ఈ సమా వేశంలో కలెక్టర్ టిఎస్ దివాకర, ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్, ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా, ఆలయ కార్య నిర్వహణ అధి కారి వీరస్వామి, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ సుకన్య సునీల్ దొర పాల్గొన్నారు.