calender_icon.png 29 November, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగరంగ వైభవంగా శ్రీలక్ష్మీదేవర, కృష్ణుడి కళ్యాణ మహోత్సవం

29-11-2025 12:36:49 AM

  1. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

నాయకపోడు కులస్తుల ఘన స్వాగతం

వెంకటాపూర్(రామప్ప), నవంబర్28,(విజయక్రాంతి):మండల కేంద్రంలో నాయకపోడు కులస్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించే శ్రీ లక్ష్మీదేవరకృష్ణుడి కళ్యాణ మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

గ్రామంలోకి చేరుకున్న మంత్రిని నాయకపోడు కుల పెద్దలు సాంప్రదా య హారతులతో, బాజాలతో ఘనంగా ఆహ్వానించారు. అనంతరం కళ్యాణ మండపానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు, మహానైవేద్యాలు నిర్వహించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. నాయకపోడు సమాజం శతాబ్దాలుగా తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ వ స్తోందనీ, ఈ కళ్యాణ మహోత్సవం వారి ఆధ్యాత్మిక విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. ఆదివాసీ మరియు వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.

ఆమెకు లక్ష్మీదేవర యొక్క ఆశీస్సులు అందజేయడం, పూజారులు ఆశీర్వచనాలు చెప్ప డం కార్యక్రమంలో విశేషం. భక్తులు కూడా మంత్రితో కలిసి దేవతల దర్శనం చేసుకుని పూజల్లో భాగస్వాములయ్యారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భగవాన్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి శ్రీలత రవి, గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు ఐలయ్య, రమేష్, స్వామి, కుల పెద్దలు పెరుక పోశాలు, గాలి సమ్మయ్య, మేకల రా జేష్, గుర్రం రాజు, ఖమ్మం సారయ్య, గుర్రం రమేష్, ఖమ్మం నాగరాజు, తైనవేని మధు, పొలం లక్ష్మయ్య, మేకల సమ్మయ్య, ముసలి కనకయ్య, గాలి లక్ష్మణు, పొలం రమేష్, పొలం కృష్ణ, గుర్రం సంపత్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు కోటి మరియు మహిళలు పాల్గొన్నారు.