29-11-2025 12:40:38 AM
హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీలో 20 మున్సిపాలిటీ లు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల విలీనం అశాస్త్రీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. ప్రజాభిప్రాయం తీసుకోకుండా ఇష్టానుసారంగా ఎలా విలీనం చేస్తారని మండిపడ్డారు. ఈ నిర్ణయంతో ప్రజలపై పన్నుల రూపంలో భారం పడుతుందని ఆందోళనవ్యక్తం చేశా రు. కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్‌ను ‘రెడ్ ఎస్టేట్’గా మార్చాలనుకుంటోదని ఇది సబబు కాదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ దురుద్దేశపు నిర్ణయాన్ని బీజేపీ వ్యతి రేకిస్తోందని తెలిపారు. ఎంఐఎం పార్టీకి ఒక ప్రాంతాన్ని ధారాదత్తం చేసేలా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఓఆర్‌ఆర్ పరిధిలోని, దానిని ఆనుకుని ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై శుక్రవారం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో ఎమ్మె ల్సీలు, ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, జీహెచ్‌ఎంసీ పార్టీ ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లతో పాటు సంబంధిత జిల్లాల నాయకులతో ఎన్.రాంచందర్ రావు సమావేశమై ఈ అంశంపై విస్తృతంగా చర్చించా రు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడా ది క్రితమే మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకొచ్చిన గ్రామీణ ప్రాంతాలను ఇప్పుడు జీహెచ్ ఎంసీలో జోడించడం వల్ల ప్రజలకు మరిం త నష్టం జరగనుందన్నారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీలో నిధుల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధిలేదని, తాజాగా వాటిని విలీనం చేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.
ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తుగ్లక్ పనులు చేసినట్లు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభు త్వం కూడా అదే దారిలో నడుస్తోందని మండిపడ్డారు. మున్సిపాలిటీలు/కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే ముందు ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా నిర్ణయం తీసుకోవడం అర్థరహితమన్నారు. ప్రభుత్వం హిల్ట్ పాలసీని తీసుకువచ్చి, ఏకంగా 9 వేల ఎకరాలకు పైగా భూములను రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టేబెట్టేం దుకు ప్రయత్నిస్తోందన్నారు.
గతంలో ‘హైడ్రా’ ప్రాజెక్ట్, మొన్న ‘హిల్ట్‌పాలసీ’, ఇప్పుడు జీహెచ్‌ఎంసీలో మున్సిపాలిటీలు/కార్పొరేషన్ల విలీనం...- ఇవన్నీ ప్రజలకు నష్టం చేకూర్చే వే అని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలని, జీవో ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, రాష్ర్ట ఉపాధ్యక్షురాలు బండ కార్తీక రెడ్డి, రాష్ర్ట ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్, మాజీ ఎమ్మెల్యే ఎన్. వి.ఎస్.ఎస్. ప్రభాకర్, ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు రాధా ధీరజ్ రెడ్డి, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.