25 February, 2026 | 9:49 PM

యూనియన్ బ్యాంక్ వ్యవస్థాపక వేడుకలు

12-11-2025 12:00 AM

నల్లకుంట ఆర్టీసీ కల్యాణ మండపంలో నిర్వహణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 11 (విజయక్రాంతి): యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన 107వ వ్యవస్థాపక దినోత్సవాన్ని అన్ని జోన్లలో ఉత్సాహంగా నిర్వహిం చింది. తెలంగాణ రాష్ట్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవో ఆశీష్ పాండే సమక్షంలో డీఎఫ్‌ఎస్ కార్యదర్శి ఎం నాగరాజు, ఐఏఎస్ మాంచెరియల్‌లో వర్చువల్‌గా 5 కొత్త శాఖలను ప్రారంభించారు. హైదరాబాద్ నల్లకుంటలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సిబ్బంది, కస్టమర్ల కోసం సాం స్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ముఖ్య అతిథిగా నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్, గౌరవ అతిథిగా హాజరయ్యారు. పూర్వ ఆంధ్రా బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ నారాయణన్ హాజరయ్యారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో యూనియ న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక పాత్రను, స్థిరమైన, సమ్మిళిత వృద్ధిపై దాని నిరంతర దృష్టిని ఇద్దరు ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ జోన్ జోనల్ హెడ్ కరే భాస్కరరావు నాయకత్వంలో నిర్వహించారు. డిప్యూటీ జోనల్ హెడ్లు టి కామేశ్వర రావు, ఎస్ అరవింద్ కుమార్, సి ఎస్ జనని, స్థానిక ప్రాంతీయ అధిపతులు పాల్గొన్నారు.