11-11-2025 05:08:43 PM
నిర్మల్ రూరల్ (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో జయహే తెలంగాణ జయ కేతనం అంటూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటే గొప్ప గేయాన్ని రచించిన కవి రచయిత అందెశ్రీ మన నుండి దూరమైనప్పటికీ ఆయన అందరి గుండెల్లో నిలిచి ఉన్నారని తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి బై రోజు వెంకట రమణాచారి అన్నారు. అందెశ్రీ మరణం తెలంగాణ సాహిత్యానికి తీరనిలోటని తెలంగాణలో ఎక్కడ సాహిత్యం నిర్వహించిన అక్కడికి వచ్చి ఆశీర్వాదాలు ఇచ్చి వెన్ను తట్టి ప్రోత్సహించే గొప్ప వ్యక్తి అన్నారు. తాను తెలంగాణ తల్లి విగ్రహం రూప శిల్పం చేసినప్పుడు ఆయన కలుసుకోగా తనను భుజం తట్టి అభినందించారని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన జ్ఞాపకాలు పాటలు తెలంగాణ సమాజంలో ఎప్పుడూ ప్రజలను చైతన్యం చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.