11-11-2025 05:10:40 PM
నిర్మల్ రూరల్ (విజయక్రాంతి): దేశంలో పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్న అంగన్వాడీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాసభలకు హాజరయ్యారు. అంగన్వాడీలు ఎదుర్కొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకొస్తున్న వాటిని పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని వేతనాలు పెంచాలని ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు రాములు జిల్లా నాయకులు సురేష్ జిల్లా అధ్యక్షురాలు గంగామణి అంగన్వాడీలు పాల్గొన్నారు.