28 June, 2026 | 4:10 PM

Breaking News

నిండు జీవితానికి రెండు చుక్కలు   •   తహసీల్దార్ భవన నిర్మాణానికి 2 కోట్ల 25 లక్షలు మంజూరు   •   లింగాపురం అంగన్వాడీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం   •   పల్స్ పోలియో చుక్కలు వేసిన బోధన్ ఆర్డీవో ఎం.విజయ కుమారి   •   పీవీ నరసింహారావుకు ఘన నివాళి   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •  

పరమాత్ముడే పాదసేవ చేసుకునే గొప్పతనం అమ్మది

12-05-2025 02:21 AM

మహిళలకు  మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి, మే 11 ( విజయక్రాంతి ) : సాక్షాత్తు పరమాత్పుడే పాద సేవ చేసుకునే గొప్పతనం అమ్మదని అలాంటి అమ్మను గౌరవించుకుని పూజించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వనపర్తి శాసనసభ్యులు  తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.  ఆదివారం మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. 

తన ప్రాణం పణంగా పెట్టి మనకు ప్రాణం పోసి ప్రయోజకులను చేసిన అమ్మలను అనాధలుగా వదిలేయరాదని ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించి వారి ఆఖరి రోజుల్లో అండగా ఉండాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో కన్న తల్లిదండ్రులను కనుక్కున్న బిడ్డలను  నిర్లక్ష్యం చేయరాదన్నారు. పిల్లలకు చిన్ననాటి నుంచి తల్లిదండ్రుల పట్ల భక్తి శ్రద్ధలతో, వినయ విధేయతలతో ఉండేలా చూడాలన్నారు.