calender_icon.png 24 May, 2025 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెంచుల కోసమే సౌర గిరి జల వికాసం

12-05-2025 02:23:31 AM

మాచారం గ్రామంలో ముమ్మర ఏర్పాట్లు

నాగర్ కర్నూల్ మే 11 (విజయక్రాంతి) నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మాచారం గ్రామంలో ఇందిరా సౌర గిరి జల వికాస పథకాన్ని మే 18న ప్రారంభించేందుకు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.

గిరిజన రైతుల సాగు భూములకు నీటి సదుపాయం కల్పించేందుకు బోరుబావులు తవ్వించి, సౌర విద్యుత్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి, ఇతర అధికారులతో కలిసి ఆదివారం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. రైతులకు పండ్ల తోటలు అందజేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.