calender_icon.png 14 May, 2025 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరిహద్దు రాష్ట్రాల నుంచి తెలంగాణ భవన్‌కు 86 మంది

12-05-2025 02:20:31 AM

  1. వారిలో 26 మంది ఇప్పటికే స్వగ్రామాలకు చేరవేత
  2. అన్ని విధాలా సహకరిస్తున్నాం: రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల నుంచి తెలంగాణకు చెందిన విద్యార్థులు, పౌరులు పెద్దసంఖ్యలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఇప్పటివరకు 86 మంది తెలంగాణభవన్‌కు చేరుకోగా, వారిలో 26 మందిని రాష్ట్రానికి వెళ్లేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలు కల్పించి స్వగ్రామాలకు పంపించినట్టు పేర్కొన్నారు.

ఇంకా దాదాపు 100 మందికిపైగా తెలంగాణ భవన్‌కు చేరుకొనే అవకాశం ఉండటంతో ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ సిబ్బందితో కలిసి భోజన వసతి, వైద్య, రవాణా తదితర ఏర్పాట్లను పరిశీలిస్తూ తగిన సూచనలు చేశారు. ఈ సమయంలో తెలంగాణ భవన్‌కు చేరుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అన్ని విధాలా సహాయాన్ని అందించనున్నదని తెలిపారు.