8 August, 2026 | 1:18 AM

చేనేత పరిశ్రమ భారత ఆర్థిక వ్యవస్థకు కీలకం

08-08-2026 12:00 AM

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): చేనేత, వస్త్ర పరిశ్రమ భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భం గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. చేనేత, వస్త్ర పరిశ్రమ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలకభాగమని, దేశానికి గణనీయమైన మొత్తంలో విదేశీ మారకాన్ని సమకూరుస్తోందని తెలిపారు.

దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పించే రంగాల్లో వస్త్ర పరిశ్ర మ ఒకటని, దాదాపు 5 కోట్ల మందికి ఈ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోందని వెల్లడించారు. ఈ రంగాన్ని మరింతగా ప్రోత్సహించి.. భారతదేశాన్ని ప్రపంచ వస్త్రకేంద్రంగా రూపుదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. 2030 నాటికి వస్త్ర ఎగుమతులను రూ.9 లక్షల కోట్లకు పెంచే లక్ష్యంతో అనేక ప్రోత్సాహకాలను అందిస్తోందని తెలిపారు.