8 August, 2026 | 1:17 AM

రూ.150 కోట్ల వ్యాపార లక్ష్య సాధన

08-08-2026 12:00 AM

సెంట్రల్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఎంఎస్‌ఎంఈ అవుట్‌రీచ్ కార్యక్రమం

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో బాలానగర్‌లోని ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ అండ్ ఫెసిలిటియేషన్ సెంటర్‌లో ఎంఎస్‌ఎంఈ అవుట్‌రీచ్ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి డాక్టర్ హిమాన్షు గుప్తా, జనరల్ మేనేజర్ (ఎంఎస్‌ఎంఈ), సెంట్రల్ ఆఫీస్, ఎం. పిచ్చయ్య, జోనల్ హెడ్, హైదరాబాద్ జోన్, సీఎస్‌ఎస్ రావు, ఐడీఎస్‌ఈ, జాయింట్ డైరెక్టర్, ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ అండ్ ఫెసిలిటియేషన్ సెంటర్, బాలానగర్, గజేంద్ర సింగ్ చౌహాన్, రీజినల్ హెడ్, హైదరాబాద్ రీజియన్ హాజరయ్యారు.

డాక్టర్ హిమాన్షు గుప్తా మాట్లాడుతూ, న్యూ టూ బ్యాంక్(ఎన్‌టీబీ), న్యూట్యూ క్రెడిట్(ఎన్‌టీసీ) వినియోగదారులపై ప్రత్యేక దృష్టి సారించి ఎంఎస్‌ఎంఈ రుణాల విస్తరణకు కృషి చేయాలని శాఖాధిపతులకు సూచించారు. ఎంఎస్‌ఎంఈ రుణాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి తన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించడంతో పాటు, బ్యాంకు ఎంఎస్‌ఎంఈ ఉత్పత్తులు, పథకాలపై ప్రజెంటేషన్ నిర్వహించారు. వినియోగదారులకు చెక్కులు, శాంక్షన్ లెటర్లు, ఇన్-ప్రిన్సిపల్ శాంక్షన్ లెటర్లు అందజేశారు.