హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు
మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): తెలంగాణకు వరప్రదాయినిగా మారిన కాళేశ్వర్యం ప్రాజెక్టుతో మాజీ సీఎం కేసీఆర్ కు మంచి పేరువస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా కేసులు పెట్టిన, హైకోర్టు మాత్రం ప్రభుత్వానికి చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. గురువా రం బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు విషయంలో తమకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తు న్నామని పేర్కొన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేధిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు స్పష్టం చేయడం కాం గ్రెస్ ప్రభుత్వానికి ఇదోక గుణపాఠమన్నారు. ఈ తీర్పుతో ప్రజలకు న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకం మరింత పెరిగిందని పేర్కొన్నారు.
సహాజ న్యాయ సూత్రాలను తుంగలో తొక్కి, సెక్షన్ 8బి, 8సి నిబంధనలను ఉల్లంఘిస్తూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావులను రాజకీయంగా దెబ్బతీసేలా చూసిన సీఎం రేవంత్ సర్కార్ చర్యలకు హైకోర్టు గట్టి తీర్పునిచ్చిందన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కేసులు పెట్టడం సరికాదని హైకోర్టు పేర్కొందన్నారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతుందన్నారు.
ఈ క్రమంలోనే ఆయనను బద్నామ్ చేయడానికి కాంగ్రెస్ కుట్ర చేసిందన్నారు. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అయిన కాళేశ్వర్యం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పీసీ ఘోష్ నివేధిక లో నిజాయితీ లేదని, కేసీఆర్, హరీష్ రావులకు ఎలాంటి శిక్ష వేయలే మని హైకోర్టు తీర్పు నివ్వడం హర్షించదగ్గ విషయం అన్నారు. సమావేశంలో అజయ్, వెనగంటి ప్రకాష్, కేమ శ్రీకాంత్, మొట్టే కిరణ్, రాజన్న, దాసరి రమేష్, కొండ గణేష్, దమ్మాపాల్, సలీమ్, దివిటి రాజు, మహేష్ తదితరలు పాల్గొన్నారు.






