6 July, 2026 | 9:41 PM

Breaking News

చంద్రపురి డివిజన్‌లో సర్ కార్యక్రమంపై ఇంటింటి ప్రచారం   •   గిరిజన దర్బార్ లో గిరిజనులు అందించిన ప్రతి విన్నపాన్ని సత్వరమే పరిష్కరించాలి   •   శివంపేట గ్రామానికి నిధుల మంజూరుపై హర్షం!   •   ప్రమాద బాధిత కుటుంబాలకు వసుధ ఫౌండేషన్ చేయూత   •   ముత్తారం ఎంపీడీవోగా ప్రవీణ్ కుమార్ నియామకం   •   భిక్కనూరులో అక్రమ నిర్మాణాలపై ప్రజావాణిలో ఫిర్యాదు   •   తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన   •   ముమ్మరంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమం   •   మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •  

చెరువును తలపిస్తున్న వైద్యశాల ప్రాంగణం

03-04-2025 06:07 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో గురువారం కురిసిన వర్షానికి మండల కేంద్రంలోని పశు వైద్యశాల ప్రాంగణంలో వర్షపు నీరు నిలిచి చెరువుని తలపిస్తుంది. కొంత సమయం కురిసిన అకాల వర్షానికే వైద్యశాల ప్రాంగణం చుట్టూ అడుగు వేయలేనంత వర్షపు నీరు నిలుస్తే, వర్షాకాలంలో ఏ విధంగా ఉంటుందో ఈ పశు వైద్యశాల ఊహించుకోవచ్చు మాటలు సరిపోవు వర్ణించడానికి వైద్యశాల కోసం అని ప్రజలు అంటున్నారు.

ఇలాంటి వైద్యశాలకు ఏ విధమైన సేవ దొరుకుతుందని, డాక్టర్లు అందుబాటులో ఉండక, పరిసరాల పరిశుభ్రంగా ఉండక, వైద్యశాల మీద ఆశ కూడా పెట్టుకోలేకపోతున్నాం అని రైతులు, గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి వెంటనే శిధిలావస్థలో ఉన్న వైద్యశాలకు మరమ్మతులు చేసి డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూడాలని రైతులు, గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.