09-02-2026 01:13:18 AM
రూ.5 వేల కోట్ల భారీ కుంభకోణం
హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): ఆన్‌లైన్ గేమింగ్ ముసుగులో భారీ పన్ను ఎగవేతకు పాల్పడుతున్న సామ్రాజ్య గుట్టును హైదరాబాద్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు రట్టు చేశారు. దేశ వ్యాప్తంగా విస్తరించిన సుమారు రూ. 5,000 కోట్ల విలువైన అతిపెద్ద గేమింగ్ సిండికేట్ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు. కొన్నేళ్లుగా ప్రభుత్వ కళ్లుగప్పి అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్న ఈ ముఠాపై పక్కా సమాచా రంతో దాడులు నిర్వహించి, కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
అంతా ఒకటే నెట్‌వర్క్.. జీఎస్టీ ఎగవేత..
ఈ భారీ కుంభకోణానికి సంబంధించి ముంబైకి చెందిన వైఎస్ ప్రభుకుమార్, హైదరాబాద్‌కు చెందిన రాజశేఖర్ రెడ్డిలను ప్రధాన సూత్రధారులుగా అధికారులు గుర్తించారు. వీరిద్దరూ కలిసి దేశవ్యాప్తంగా ఒక పటిష్టమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి, ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వేల కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన 28 శాతం జీఎస్టీని ఎగవేయడమే కాకుండా, ఈ నిధులను హవాలా మార్గాల్లో మళ్లించినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
శనివారం హైద రాబాద్‌తో పాటు దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలో జీఎస్టీ ఇంటెలిజెన్స్ బృందాలు ఏకకాలంలో మెరుపు దాడులు చేపట్టాయి. గేమింగ్ కంపెనీల కార్యాలయాలు, నిర్వాహకుల నివాసాల్లో నిర్వహిం చిన ఈ సోదాల్లో ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు కీలకమైన డిజిటల్ డాక్యుమెంట్లను అధికారులు సీజ్ చేశారు. గడిచిన కొన్నేళ్లుగా ఈ సిండికేట్ ఎంత మేర పన్ను ఎగవేసింది? ఎవరెవరికి ఇందులో భాగస్వామ్యం ఉంది? అన్న కోణంలో డేటాను విశ్లేషిస్తున్నారు.
సిండికేట్‌లో బడా బాబులు?
ప్రస్తుతానికి ఇద్దరు ప్రధాన సూత్రధారులను గుర్తించినప్పటికీ, ఈ సిండికేట్ వెనుక మరికొంతమంది బడా బాబులు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఆన్‌లైన్ గేమిం గ్ యాప్‌ల ద్వారా బాధితుల నుంచి వసూ లు చేసిన నగదును షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లించినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. ఇది కేవలం పన్ను ఎగ వేత మాత్రమే కాదు, భారీ ఆర్థిక నేరం. త్వరలోనే ఈ కేసులో అరెస్టులతో పాటు సంచ లన విషయాలు వెలుగులోకి వస్తాయని జీఎస్టీ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపా యి. ఈ దాడులతో ఆన్‌లైన్ గేమింగ్ నిర్వాహకుల్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది.