6 April, 2026 | 2:45 AM

హామీలు అమలు చేయడం అభినందనీయం

06-04-2026 12:05 AM

పటాన్ చెరు, ఏప్రిల్ 5: మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని గెలిచిన వెంటనే అమలు చేయడం అభినందనీయమని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు కౌన్సిలర్ సుల్తాన్పూర్ ఈశ్వరమ్మ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఏర్పాటు చేసిన రెండు రూపాయలకే మినరల్ వాటర్ ప్లాంట్ ను ఆదివారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ప్రజలు ఎంతో నమ్మకంతో బిఆర్‌ఎస్ పార్టీకి అధికారం అందించారని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కారానికి నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. అతి త్వరలో మున్సిపల్ పరిధిలో 15 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడమైనట్లు తెలిపారు. ప్రతి వార్డు అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుమలత, మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి. ఆయా వార్డుల కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.