2 June, 2026 | 1:18 AM

ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి

02-06-2026 12:00 AM

ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

సనత్నగర్, జూన్1 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 2 వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకుని నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ లలో జెండాలు ఎగురవేసి వేడుకలను ఘనంగా జరపాలని చెప్పారు. డివిజన్ లలో ఉదయం  జెండాలను ఎగురవేసిన అనంతరం అమీర్ పేట లోని సత్యం థియేటర్ సర్కిల్ లో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి ఆధ్వర్యంలో ఉదయం 10.00 గంటలకు నిర్వహించే వేడుకలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరుకావాలని అన్నారు.

జెండా ఆవిష్కరణ అనంతరం తెలంగాణ ఉద్యమకారులను సన్మానించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజన్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, గుర్రం పవన్ కుమార్ గౌడ్, ఆకుల హరికృష్ణ, శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, నాగులు, నరేందర్, కిషోర్, ఏసూరి మహేష్, అశోక్ యాదవ్, సురేష్ గౌడ్, నరేందర్, కొండాపురం మహేష్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, లక్ష్మీపతి, కోటేశ్వర్ గౌడ్, అంబులెన్స్ సురేష్, కూతురు నర్సింహ, ఆరీఫ్, వెంకటరమణ, శ్రీకాంత్ రెడ్డి, ప్రేమ్, కట్టా బలరాం,  ఆంజనేయులు, గోపీలాల్ చౌహన్, గులాబ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.