6 August, 2026 | 2:48 AM

సర్వే నంబర్ 185.. పట్టా భూమే

06-08-2026 01:40 AM

ఆర్డీవోకు కౌన్సిలర్ ఒగ్గు జయలక్ష్మి కిషోర్ వినతి

షాద్‌నగర్, ఆగస్టు5 (విజయక్రాంతి):షాద్నగర్ 16వ వార్డు క్రిస్టియన్ కాలనీలోని సర్వే నంబర్ 185 పట్టా భూమేనని, రిజిస్ట్రేషన్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి కొనుగోలు, అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని కౌన్సిలర్ ఒగ్గు జయలక్ష్మి కిషోర్ ఆర్డీవో సరితాకు వినతిపత్రం ఇచ్చారు.గతంలోనే ఈ భూమికి టౌన్ ప్లానింగ్ లేఅవుట్ అనుమతులు (ఎల్పీ నంబర్లు) మంజూ రయ్యాయి. దీని ఆధారంగానే ఇళ్ల నిర్మాణాలు, బ్యాంకు రుణాలు పొందారు.

1970 నుంచి క్రయవిక్రయాలు జరుగుతున్నాయని, ఈ ఏడాది జూన్ వరకు కూడా రిజిస్ట్రేషన్లు అయ్యాయని తెలిపారు. ఇటీవల కలెక్టర్ ఆదేశాలతో సర్వే నంబర్ 185ను సెక్షన్ 22ఏ (ప్రభుత్వ భూమి) కింద చేర్చడంతో రిజిస్ట్రేషన్లు, బ్యాంక్ రుణాలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఈ సర్వే నంబర్ను నిషేధిత జాబితా నుంచి తొలగించి, పట్టా భూమిగా గుర్తించాలని కౌన్సిలర్ కోరారు.