పేకాట స్థావరంపై పోలీసుల దాడి ఏడుగురు అరెస్ట్
06-08-2026 12:22 AM
గట్టు, ఆగసు 5 (విజయక్రాంతి): గట్టు మండలం మాచర్ల గ్రామంలో అక్రమంగా పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు బుధవారం దాడి నిర్వహించారు. ఈ దాడిలో మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.23,450 నగదును స్వాధీనం చేసుకున్నట్లు గట్టు ఎస్‌ఐ శేఖర్ గౌడ్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.






