4 June, 2026 | 2:45 AM

సమీకృత మార్కెట్‌ను వినియోగంలోకి తేవాలి

04-06-2026 02:13 AM

సీపీఐ విన్నూత్న నిరసన

మహబూబాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసి అన్ని హంగులతో నిర్మించిన సమీకృత మార్కెట్ ను వెంటనే వినియోగంలోకి తేవాలంటూ సీపీఐ మహబూబాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ సారధి రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సిపిఐ మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు మెడలో కూరగాయల దండలు ధరించి, తోపుడు బండ్లతో వినూత్న తరహాలోని రసన వ్యక్తం చేశారు.

కూరగాయల మార్కెట్ నిర్మాణంలో భాగంగా తాత్కాలిక కూరగాయల మార్కెట్ను గాంధీ పార్కులో ఏర్పాటు చేశారని, కూరగాయల మార్కెట్ నిర్మించి ప్రారంభించినప్పటికీ కూడా వినియోగంలో కి తీసుకు రాకపోవడంలో ఆంతర్యం ఏమిటని, కూరగాయల మార్కెట్ వినియోగంలోకి తేవడానికి అడ్డుపడుతున్న అదృశ్యశక్తులు ఎవరని ప్రశ్నించారు.

ప్రజలకు, శ్రీరామనవమి వేడుకలకు ఉపయోగకరంగా ఉండే గాంధీ పార్కులో తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బంది కలుగుతోందని, వెంటనే సమీకృత మార్కెట్ ను వినియోగంలోకి తెచ్చి, బండిగా మారిన గాంధీ పార్కును విడుదల చేయాలని, అంబేద్కర్ భవన్ అభివృద్ధి చేయాలని మున్సిపల్ సిపిఐ ఫ్లోర్ లీడర్ అజయ్ సారధి రెడ్డి డిమాండ్ చేశారు.

అనంతరం మున్సిపల్ క మిషనర్ వినోద్ కుమార్కు వినీత్ పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నా యకులు పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, నర్ర సంధ్య, శ్రావణ్, చింతకుంట్ల వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి, వెలుగు శ్రావణ్, వంకాయలపాటి చిరంజీవి, పాల్, శంకర్, పద్మ, రఫీ తదితరులు పాల్గొన్నారు.