ఇండ్ల గణన వేగంగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్
మహబూబాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న జన గణన 2027, ఇండ్ల సర్వే వేగంగా పూర్తి చేయాలని, ఖచ్చితమైన సమాచారాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలని, అర్బన్, రూరల్ పరిధిలో సర్వే సిబ్బంది ఎనిమినేటర్స్, సూపర్వైజర్స్, చేస్తున్న పనులను మండల స్థాయిలో తహసిల్దార్లు (చార్జి ఆఫీసర్స్) క్షేత్ర పర్యటన చేస్తూ తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ స్నేహ శబరిష్ సూచించారు.
గుర్తించిన డోర్ లాక్ గృహాలను మరోసారి సందర్శించి సర్వే పూర్తి చేయాలని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన సర్వే వివరాల ఆన్లైన్ నివేదికలను కలెక్టర్ పరిశీలించారు. ఎన్యుమరేటర్లు సర్వే వివరాలను వెంటవెంటనే సూపర్వైజర్ లాగిన్లకు సింక్ చేయాల్సిందిగా సూచించారు. తద్వారా జిల్లా నమోదు వివరాలు రాష్ట్రస్థాయిలో రికార్డు అవుతాయని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కే. అనిల్ కుమార్, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసరావు, తహసిల్దారులు, జీ.వివేక్, నాగ భవాని, రాజేశ్వరరావు, శ్రీనివాస్, విజయ, మున్సిపల్ కమిషనర్లు, ఏఎస్‌ఓ లు తదితరులు పాల్గొన్నారు.






