ప్రజాభీష్టం మేరకే ఇంటిగ్రేటెడ్ స్కూల్
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
జిన్నారం/ అమీన్ పూర్, ఏప్రిల్ 9 : జిన్నారం మున్సిపల్ నల్తూరు గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పై కలెక్టర్ తో మాట్లాడిన విషయంపై గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి జిన్నారం మున్సిపల్ నల్తూరు గ్రామంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కొనసాగించాలని జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, కౌన్సిలర్ల ఆధ్వర్యంలో కలిసి మెమోరండం అందజేశారు.
దీనికి ఎమ్మెల్యే జీఎంఆర్ సానుకూలంగా స్పందించి జిన్నారం మున్సిపల్ ప్రజలు ఎక్కడ కోరుకుంటే అక్కడే కొనసాగిస్తానని హామీనిచ్చినట్లు మున్సిపల్ చైర్మన్ జనార్దన్ తెలిపారు. నల్తూరు గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణంలో అపోహలు, అనుమానాలు పెంచుకోవద్దని ప్రజాభీష్టం మేరకే స్కూల్ నిర్మాణం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో చైర్మన్ నకిర్తి జనార్ధన్ తో పాటు కౌన్సిలర్ ప్రభాకర్ రెడ్డి, బేలే కృష్ణ, నాయకులు శంకరప్ప, ఆదిరామకృష్ణ, కొడకంచి నాగరాజు, పెద్దమ్మ గూడెం నాగరాజు, మాజీ సర్పంచులు యాదయ్య, శ్రీశైలం యాదవ్, నల్తూరు మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్, కృష్ణ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




