లారీల సమస్య పరిష్కరించాలి
కొల్చారం, మే 21: అంసానిపల్లి సహకార సంఘం పరిధి గ్రామాలకు గత వారం రోజులుగా దాన్యం లారీలు రాకపోవడంతో తూకం వేసిన ధాన్యం ఎక్కడికి అక్కడే ఉండిపోయిందని గ్రామానికి చెందిన రైతులు సహకార సంఘం అధ్యక్షులు మన్నె రాము లు ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. వెంటనే లారీల సమస్య పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భం గా తహసిల్దార్ శ్రీనివాస్ చారి మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించేం దుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ట్రాక్టర్ల ద్వారా ధాన్యం పంపాలని రైతులకు సూచించారు. లారీల సమస్య అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొంగుడు సర్పంచ్ స్వామి, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్, నాయకులు రామన్న, పోతిరెడ్డిపల్లి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






