10 July, 2026 | 1:32 AM

కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

10-07-2026 12:16 AM

ఘట్ కేసర్, జూలై 9 (విజయక్రాంతి) : కాంట్రాక్ట్ ఔట్ సోర్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటియుసి జాతీయ సమితి సభ్యులు రవిచందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. ఘట్ కేసర్ ఎఐటియుసి మండల 4వ మహాసభను రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి జయచంద్ర అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏఐటియుసి జాతీయ సమితి సభ్యులు రవిచందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలలోని 29 కార్మిక చట్టాలను రద్దుచేసి 4కోడ్ లను తీసుకొచ్చి కార్మికులకు వ్యతిరేకంగా బడపెట్టుబడి దారులకు కొమ్ముకాస్తున్న పరిస్థితి నెలకొందన్నారు.

కాంట్రాక్ట్ ఔట్ సోర్స్ కార్మికులనందరినీ పర్మినెంటు చేయకున్నా కనీస వేతనం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రూ. 26 వేలు జీతం ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వాలు పెడచెవినపెట్టి పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఏఐటియుసి యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులందరం మరిన్ని ఐక్యపోరాతలకు సిద్ధమై పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈనెల 11న శనివారం యాప్రాల్ నందు జరిగే మేడ్చల్ జిల్లా 4వ మహాసభ లో భవిషత్ కార్యక్రమాలకు రూపకల్పన చేసుకొని కార్మికులకు న్యాయం జరిగే వరకు మిలిటెంట్ పోరాటాలకు కార్మికలోకం కదలాలన్నారు. నాయకులు ఏఐటియుసి ఉపాధ్యక్షులు లొట్టి ఈశ్వర్, మున్సిపల్ సంఘం నాయకులు రామచందర్ సమక్షంలో ఘట్కేసర్ మండల ఏఐటియుసి అధ్యక్షులుగా బాలనర్సయ్య, మండల కార్యదర్శిగా శ్రీనివాసరావు, మండల గౌరవ అధ్యక్షులుగా కల్లూరి జయచంద్ర లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది.