20న సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల ‘జనజాగరణ యాత్ర’
వికారాబాద్ రూరల్ -09(విజయక్రాంతి ) వికారాబాద్ జిల్లా కేంద్రంలో జూలై 20న వికారాబాద్ పట్టణంలో నిర్వహించనున్న సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల జనజాగరణ యాత్రను జయప్రదం చేయాలని సిపిఎస్ సంఘం జిల్లా అధ్యక్షుడు పట్నం రాఘవేందర్ తెలిపారు. ఈ సందర్భంగా గురువా రం జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు ప్రభు త్వ పాఠశాలలో పోస్టర్ను వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలిసి ఘనం గా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షు లు రాఘవేందర్ మాట్లాడుతూ, 2004లో ప్రవేశపెట్టిన సీపీఎస్ విధానం వల్ల గత 22 సంవ త్సరాలుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అ న్యాయానికి గురవుతున్నారని అన్నారు. పదవీ విరమణ అనంతరం సామాజిక భద్రత కల్పించడంలో సీపీఎస్ పూర్తిగా విఫలమైందని, ఉద్యోగులకు గౌరవప్రదమైన జీవన భరోసా కల్పించాలంటే పాత పెన్షన్ విధానం (OPS)ను పునరుద్ధరించాల్సిందేనని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు CPSను రద్దు చేసి OPSను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జనజాగరణ యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ యాత్ర ముగింపు సందర్భంగా ఆగస్టు 23న ఛలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చె ప్పారు.
జూలై 19న, కొడంగల్ నియోజకవర్గం, తాండూర్ నియోజకవర్గం లో జులై 20 వికారాబా ద్, పరిగి నియోజకవర్గంలో జనజాగరణ యాత్రలో జిల్లాలోని సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బాబూసింగ్, కడియాల. చంద్రశేఖర్, రాజు, దేవ్యా మద్దతు తెలుపడం జరిగింది.






