జాతర మన సంస్కృతికి ప్రతీక
శాసనమండలి సభ్యుడు, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
శంకర్ పల్లి, మార్చి 29 (విజయ క్రాంతి): జాతర ఉత్సవాలు మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అని శాసనమండలి సభ్యుడు, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని బుల్కాపూర్ శివారులో నెలకొన్న శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాత ర ఉత్సవాలను మరువకూడదని అన్నారు.
తెలంగాణ ప్రాంతంలో జాతర ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరు ఐక్యతతో ఉండి జాతర ఉత్సవాలను శాంతియుతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దేవాలయ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులను ఏర్పాటు చేయడం జరుగుతుందని, పురాణ దేవాలయాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కాగా బుల్కాపురం గ్రామంలో ప్రతి ఇంటి నుంచి పెద్ద ఎత్తున బోనాల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. పోతురాజు విన్యాసాలు శివస త్తులు ఆటలు అందరిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మాన్న గారి వెంకటరెడ్డి. కౌన్సిలర్లు భానూరి కృష్ణ, మణికొండ లలిత మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మమ్మ రాంరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.




