పేదలకు సీఎం సహాయనిధి వరం
చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి పామేన భీంభరత్
మొయినాబాద్, మార్చి 29 (విజయ క్రాంతి): ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరంలాంటిదని, చేవెళ్ల నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేన భీంభరత్ పేర్కొన్నారు. నిరుపేదలు సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో మంజూరైన చెక్కులను ఆదివారం మొయినాబాద్ మున్సిపల్ పరిధి లోని అజీజ్ నగర్ లోని తన కార్యాలయంలో చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, మొయి నాబాద్ మండలాల ఆయా గ్రామాలకు చెందిన 65 మంది లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆనారోగ్యంతో బాధపడుతూ వివిద ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనిందించడం జరుగుతుందని చెప్పారు. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని వందలాది మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంలాంటిదని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్, మండల పార్టీ అధ్యక్షుడు మాణయ్య, ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు అమరేందర్ రెడ్డి, గీత వనజాక్షి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొక్క బాలకృష్ణారెడ్డి, చిలుకూరు రాజు, బిక్షపతి, జైపాల్ రెడ్డి, ఆయా మండల, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ జడ్పిటిసి, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గోన్నారు.




