11 August, 2026 | 2:48 AM

లేబర్ కోడ్‌లను రద్దు చేయాల్సిందే

11-08-2026 12:58 AM

కంగ్టిలో కార్మిక, కర్షక సంఘాల జైల్‌బరో

కంగ్టి, ఆగస్టు 10 (విజయక్రాంతి) : నాలుగు లేబర్ కోడ్లతో పాటు విద్యుత్, విత్తన బిల్లులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కంగ్టి మండల కేంద్రంలో సోమవారం సీఐటీయూ, ఏఐఏడబ్ల్యూయూ, ఏఐకేఎస్ ఆధ్వర్యంలో జైల్భరో కార్యక్రమం నిర్వహించారు.పెద్ద సంఖ్యలో కార్మికులు రైతులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా సీఐటీయూ డివిజన్ నాయకుడు సతీష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లతో కార్మికుల హక్కులకు భంగం కలుగుతుందని వాటిని రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంగ్రామ్, శివరాజ్,ఆశా కార్యకర్తలు,ఆటో కార్మికులు పాల్గొన్నారు.