బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు
రేగోడు, ఆగస్టు 10 (విజయ క్రాంతి) : మండలంలోని వెంకటపురం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు సోమవారం మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పుకుని బిఆర్‌ఎస్ పార్టీలు చేరారు. కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్‌ఎస్ పార్టీలో చేరిన పలువురు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అందువల్లనే కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రేగోడు మండల బిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సుంకే రమేష్, పిఎసిఎస్ చైర్మన్ రాజు యాదవ్, మాజీ ఎంపిటిసి గొల్ల నరసింహులు, మాజీ సర్పంచ్ నరసింహులు, బిఆర్‌ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు వినోద్ కుమార్ బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు గుర్నాథ్ రెడ్డి, హనుమంతు, తదితరులు పాల్గొన్నారు






