26 April, 2026 | 1:43 AM

సిరులు గల్ల నేల నా తెలంగాణ

09-09-2025 12:00 AM

గునుగు పూలు తంగేడు పూలు 

కలువ పూలు కట్లపూలు

పట్టుకుచ్చులు కనకాంబరాలు

గోరంట రుద్రాక్ష పువ్వులు

పూలు కొలిచే నేల తెలంగాణ సిరులు గల్ల నేల నా తెలంగాణ 

చిందు యక్షగానాలు

గొల్ల సుద్దులు ఒగ్గు కథలు 

జమడిక దెబ్బలు.. తీన్మార్ సప్పుళ్లు 

పేరిణి నృత్యం.. గుస్సాడీ నృత్యం 

కళలు అంటేనే తెలంగాణ

సిరులు గల్ల నేల నా తెలంగాణ

రామప్ప పాకాల చెరువు 

గండిపేట దుర్గం చెరువు

లక్నవరం ఘనపురం చెరువు 

ఎల్లమ్మ చెరువు 

మైలారం చెరువు 

గొలుసుకట్టు చెరువుల 

తెలంగాణ సిరులుగల్ల నేల నా తెలంగాణ 

బెల్లం బువ్వ బెల్లప్పలూ

సత్తు పిండులు సత్తు ముద్దలు

పలాపురం మలీదముద్దలు 

చిలకల పేరు చక్కెర కుడుకలు 

మిఠాయి అంటేనే 

తెలంగాణ సిరులుగల్ల నేల నా తెలంగాణ 

సిరాగోని కచ్చకాయలు చార్పత్తి 

వచ్చిన ఆటలు

డాల్గడి దశన్న పొడులు

కాశపుల్ల చిక్కుడు ఆటలు

ఆటపాటలు అంటేనే తెలంగాణ

సిరులుగల్ల నేల నా తెలంగాణ

నిర్మల్ బొమ్మలు ముత్యాల గాజులు

బిద్రివేర్ నకాశి బొమ్మలు

డోక్రా బొమ్మలు హస్తకళలు

ఫిలిగ్రీ సొగసులు పెంబర్తి కళలు 

కళాకృతులు అంటేనే తెలంగాణ 

సిరులుగల్ల నేల నా తెలంగాణ 

ఉస్మాన్ సాగర్ 

హిమాయత్ సాగర్ 

శ్రీరాంసాగర్ 

నాగార్జునసాగర్ 

నిజాం సాగర్

హుస్సేన్ సాగర్ నీటికి లేదు 

ఇక్కడ సీకర్ నిండుకుండ 

నా తెలంగాణ సిరులు గల్ల నేల 

నా తెలంగాణ

 బొల్లం బాలకృష్ణ