18 May, 2026 | 3:04 AM

ఉద్యమనేతను గెలిపించాలి

22-04-2024 01:23 AM

l కరీంనగర్ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు మద్దతుగా కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నాయకుడు వినోద్‌కుమార్ గళం కరీంనగర్‌కు బలమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అన్నారు. కరీంనగర్ నియోజకవర్గం ఎంపీగా వినోద్ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన  చురుకైన పాత్ర పోషించారని కొనిడాయాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో స్థాపించిన టీఆర్‌ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరని తెలిపారు. 2004లో ఎంపీగా గెలిచిన తరువాత పార్లమెంటులో 32 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇవ్వడంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.