calender_icon.png 19 January, 2026 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన నేత

19-01-2026 01:43:21 AM

స్వర్గీయ నందమూరి తారక రామారావు

మేడ్చల్ అర్బన్, జనవరి 18(విజయక్రాంతి): సమాజమే దేవాలయం...ప్రజలే దేవుళ్ళు‘అనే నినాదంతో తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నాయకులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావేనని తెలుగుదేశం పార్టీ నేతలు కొనియాడారు.గ్రేటర్ హైదరాబాద్ మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ పరిధిలోని ఎన్టీఆర్ 30 వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు,అభిమానులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సినిమా రంగం నుండి రాజకీయ రంగంలోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే ప్రజల మనుషులను గెలుచుకున్న స్వర్గీయ ఎన్టీఆర్ పేదల పక్షపాతి సమాజానికి న్యాయానికి ప్రతీకగా నిలిచారని వారు చెప్పారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా స్వర్గీయ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు పరిపాలనలో చూపిన దూరదృష్టి గ్రామీణ ప్రజల అభ్యున్నతికి చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శేఖర్ చౌదరి. వాసు వర్మ. సుధాకర్ గౌడ్.భాస్కర్. బాలకృష్ణ. మౌలానా. బాలకిషన్. వెంకట్ రావు. రాంబాబు. ప్రసాద్ గౌడ్. రాజేష్ తదితరులు పాల్గొన్నారు.