14-05-2025 01:24:40 AM
పార్టీ విస్తరణకు గురుప్రసాద్ చేసిన కృషి మరువలేనిది
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కొత్తగూడెం, మే 13 (విజయక్రాంతి): పేద ప్రజల కష్టాలు గుర్తించి వారికి సేవలందించడం ద్వారా అల్లా గురుప్రసాద రావు జననేతగా ఖ్యాతిపొందారని, అయన అందించిన నిస్వార్ధ సేవల ఫలితంగానే కొత్తగూడెం, పరిసర ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీ బలమైన పునాదులు ఏర్పడ్డాయని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశి వరావు అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సిపిఐ కార్యవర్గ సభ్యులు, ప్రముఖ న్యాయవాది, కమ్యూనిస్టు నేత ఆళ్ల గురుప్రసాద రావు సంస్మరణ సభ మంగళవారం పట్టణంలోని కొ త్తగూడెం క్లబ్బులో లయర్స్ అసోయేషన్ రాష్ట్ర నాయకులు వై ఉదయ్ భాస్కర్ అధ్యక్షతన జరిగింది. తొలుత సిపిఐ నాయకులు, వివిధ రాజకీయపక్షాల నాయకులు, న్యాయవాదులు గురు ప్రసాద రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగి న సంస్మరణ సభలో కూనంనేని మాట్లాడారు.
కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా, న్యాయవాదిగా కొత్తగూడెం ప్రాంతంలో గురుప్రసాద్ యెనలేని సేవలందించారని, పేద ప్రజలు ఎదుర్కొంటు న్న సమస్యలను గుర్తించి వాటి పరిస్కారంకోసం శ్రమించారన్నారు. సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి అయోధ్య, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాధం, మిరియాల రంగయ్య, సరెడ్డి పుల్లారెడ్డి, ఎస్ డి సలీం, కల్లూరి వెంకటేశ్వర్ రావు, నరాటి ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్, కమటం వెంకటేశ్వరావు, సలిగంటి శ్రీనివాస్, చంద్రగిరి శ్రీనివాస్, రేసు ఎల్లయ్య, జిల్లా సమితి సభ్యులు వాసిరెడ్డి మురళి, భూక్యా దస్రు, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, ఆడుసుమల్లి సాయిబాబా, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు.