14-05-2025 01:25:49 AM
భద్రాద్రి కొత్తగూడెం మే 13 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం రేంజ్ పరిధిలోని పర్ణశాల సమీపంలోనే గొల్లగూడెం గ్రామంలో అక్రమంగా అటవీ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించిన అక్రమ దారులను మంగళవారం అటవీశాఖ అధికారులు అడ్డుకున్నట్లు దమ్ముగూడెం రేంజ్ అధికారి ఎస్ సుజాత ఒక ప్రకటనలో తెలిపారు.
మోత్తాపురం బెడ్ కంపార్ట్మెంట్ నెంబర్ 59 లో 17 మంది స్థానికులు అటవీ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించారు. గతంలో ఈ విషయమై అటవీ కేసు పి ఆర్ ఓ నెంబర్ 50 /55 2024 సెప్టెంబర్ 25, పోలీస్ ఎఫ్ ఐ ఆర్ నెంబర్ 105 /2024, 2024సెప్టెంబర్ 18. డబ్ల్యూ పిఓ నెంబర్ 26310/20 24 విచారణలో ఉన్నట్లు తెలిపారు.
ఆదివారం మరోసారి ఆక్రమించే ప్రయత్నం చేయడంతో అటవీశాఖ పోలీస్ శాఖ అధికారులతో ఆక్రమితుల నుంచి భూమిని స్వాధీనం చేసుకొని మొక్కలు నాటినట్లు ఆమె తెలిపారు. ఎవరైనా భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.