calender_icon.png 19 January, 2026 | 7:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేను ఆహ్వానించిన మున్నూరుకాపు సంఘం బాధ్యులు

19-01-2026 12:14:12 AM

ముకరంపుర, జనవరి 18 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమ మహోత్సవానికి రావాల్సిందిగా మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పుట్ట పురుషోత్తం రావు కోరారు. ఆదివారం మున్నూరు కాపు సంఘం బాధ్యులు ఎమ్మెల్యే ను కలిసి ఈనెల 25న సికింద్రాబాద్ లో జరిగే తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా వారికి ఆహ్వాన పత్రాన్ని అందజేసి శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పుట్ట పురుషోత్తం రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం మున్నూరు కాపు సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమం తోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన మున్నూరు కాపు సర్పంచ్ లను సన్మానించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరి శంకర్, రాష్ట్ర కార్యదర్శి ఈసంపల్లి వెంకన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు మంగళారపు లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాధాకృష్ణ, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి సత్తినేని శ్రీనివాస్, నాయకులు కూరగాయల తిరుపతి, కర్ర సూర్య శేఖర్, మిడిదొడ్డి నవీన్, కన్జర్ల రేణుక, తదితరులు పాల్గొన్నారు.