calender_icon.png 9 January, 2026 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలలో లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలి

08-01-2026 01:45:05 AM

-రూమ్ టూ రీడ్ స్వచ్ఛంద సంస్థ

చేర్యాల, జనవరి 7 : చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూమ్ టు రీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని బుధవారం చేర్యాల మండల విద్యాధికారి బి.నరేందర్, గ్రామ సర్పంచ్ కొమ్ము రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొమ్ము రవి మాట్లాడుతూ విద్యార్థులు ప్రాథమిక స్థాయిలోనే విద్యా పట్ల ఉన్న ఆభిరుచితో గ్రంథాలయాలను ఉపయోగించుకొని చదువులో రాణించాలని కోరారు.

మండల విద్యాధికారి నరేందర్ మాట్లాడుతూ గ్రంథాలయంలో 600 పుస్తకాలు ఉన్నాయని, విద్యార్థులందరూ వారికి కేటాయించిన సమయంలో పుస్తకాలను చదివి భాష సామర్థ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో  పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయోధ్య, ఏఏపిసి చైర్ పర్సన్ రాజేశ్వరి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వీరస్వామి, అధ్యాపకులు, ఉప సర్పంచ్ కడారి పల్లవి, రూమ్ టూ రీడ్ సంధానకర్త ఉదయశ్రీ, సిఆర్పిలు పాల్గొన్నారు.