15 April, 2026 | 9:35 AM

ఆల్మట్టిపెంపుతో నష్టమే ఎక్కువ!

15-10-2025 12:13 AM

పుతుంబాక భారతీ :

కర్నాటక ప్రభుత్వం కృష్ణానదిపై ఉన్న ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచాలని తీసుకున్న నిర్ణయం మరోమారు తీవ్ర ఆందోళనకు దారి తీసింది. డ్యామ్ ఎత్తు పెంచితే ఆ రాష్ట్రానికి ప్రయోజనం చేకూ ర్చే అవకాశం ఉన్నా.. తెలంగాణకు మరిం త నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయని సాగునీటి నిపుణులు, రైతు సంఘాలు, వా మపక్ష పార్టీల నేతలు ఎప్పటి నుంచో ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల అధికార, ప్రతి పక్ష పార్టీల నాయకులు తలో మాట మాట్లాడుతున్నా ఆల్మ ట్టి డ్యాం ఎత్తు పెంపును అడ్డుకోవడంలో వాళ్ళు చేసింది ఏమీ లేదని కళ్ళముందటి చరిత్ర నిరూపిస్తూనే వుంది. ఆల్మట్టి డ్యాం చుట్టూ వున్న రాజకీయాల్ని మొదటి నుంచి గమనిస్తున్న ప్రజాప్రతినిధిగా ఈ పాపంలో గతంలో రాష్ట్రాన్నీ ఏలిన పార్టీలదే అని చెప్పక తప్పదు. కృష్ణా జలాలపై కర్ణాటకకు 509 టీఎంసీలను కేటాయిస్తూ బచావత్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది.

దానికి అనుగుణంగా అప్పర్ కృష్ణా నదిపై ఆల్మట్టి, నారాయణపూర్, హిప్పర్గి వియర్ ప్రాజెక్టులను చేపడుతూ వచ్చింది కర్ణాటక ప్రభుత్వం. 509 మీటర్ల ఎత్తులో ఆల్మట్టి డ్యాంను నిర్మాణం చేపట్టారు. అంత వరకు బాగానే ఉంది. కానీ 1994లో కర్ణాటకలో హెచ్‌డీ దేవెగౌడ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది తిరగకముందే ఆల్మ ట్టి డ్యాం ఎత్తును 509.016 అడుగుల నుండి 524.526 అడుగులకు పెంచాలని నిర్ణయం తీసుకుంది.

డ్యాం ఎత్తు పెంపు నిర్మాణం ఆ రాష్ట ప్రజలకు ఉపయోగకరమయినప్పటికీ ఆల్మట్టి డ్యాం ఎత్తు పెం చితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి, నల్లగొండ, వికారాబాద్ జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్ నగరానికి తాగునీరుకు సైతం ఇబ్బందులు వ స్తాయంటూ అనాడు సీపీఎం శాసన సభ నేతలుగా మేమంతా అసెంబ్లీలో ఆ అంశా న్ని లేవనెత్తాం.

కర్నాటక ప్రభుత్వం దిగువ రాష్ట్రాల అభ్యంతరాలను ఏమాత్రం లెక్క చేయడం లేదు. తమ రాష్ర్ట వ్యవసాయ ప్రయోజనాలపై మాత్రమే దృష్టి పెట్టింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఇది రాజకీయ రూపు దాల్చింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఆల్మట్టి ఎత్తు పెంపు ఇబ్బందికర అంశంగా మారిపోయింది. 

తెలంగాణకు అన్యాయం

ఆల్మట్టి డ్యాం ఎత్తు వివాదం ఇదేమి కొత్తకాదు. 2000లలోనే ఈ డ్యాం ఎత్తు పెంపుపై అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్య తిరేకత తెలిపింది. కృష్ణా ట్రిబ్యునల్ ముం దు దీన్ని లేవనెత్తింది. ఇప్పటికీ ఇది ట్రిబ్యునల్ ముందు విచారణలో ఉంది. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డ్యాం ఎత్తును 519 మీటర్లకు పరిమితం చేశారు. అయినప్పటికీ, కర్నాటక ప్రభుత్వం ఇప్పు డు భూసేకరణతో పాటు ఎత్తు పెంపునకు అడుగులు వేస్తోంది.

ఈ నేపథ్యంలో గత నెల 16న కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గం ఆల్మ ట్టి ఎత్తు పెంపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ పెంపు వల్ల కేవలం తెలంగాణ ప్రాంతానికే కాకుండా రాయలసీమ ప్రాంతం కూడా ఎడారిగా మారే ప్రమా దం ఉంది. హంద్రీనివాకు, తెలుగు గంగ కు నీళ్లు రావని క్రమంగా నీటి సమస్య ఏర్పడుతుందని, ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టుకు మరింత ఇబ్బంది ఏర్పడుతుందనేది అందరి వాదన.

అధిక వర్షాల సమస్యలో వరద నీరు వచ్చిన సందర్భంలో తప్ప మిగతా సందర్భాల్లో ఆల్మట్టి వల్ల కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదనేది ఎప్పటి నుంచో సీపీఎం పార్టీ చెబుతూ వస్తుంది. కృష్ణానదిపై కర్ణాటక ప్రభుత్వం బాగల్కోట్ జిల్లా ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం (1995 - 96) లోనే.. ‘ఆ ప్రాజెక్టుతో మనకు ప్రమాదం పొంచివుందని’ సత్తెనపల్లి శాస న సభ్యురాలిగా నేను అసెంబ్లీలో లేవనెత్తితే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబా బు నాయుడు..

‘కమ్యూనిస్టులకు ముందే కలలు వస్తాయా?’ అని అవహేళన చేశారు తప్ప ఆ సమస్య లోతును అర్థం చేసుకోలేక పోయారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో యునైటెడ్ ఫ్రంట్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు, దేవగౌడ్ పట్ల మృదు స్వభావంగా వ్యవహరించడంతో అప్పటి కర్ణాటక అధికారులు యధేచ్ఛగా ఎత్తును పెంచుకుంటూ పోయారు. ఒకరకంగా 2002 నాటికే ఆ పనులు పూర్త య్యాయని చెప్పవచ్చు.

గత సర్కార్ నిర్లక్ష్యం

‘మా పాలన, మా నీళ్ళు, మా ఉద్యోగా లు’ అంటూ అస్తిత్వ ఉద్యమాన్ని లేవనెత్తి న తెలంగాణ ఉద్యమ నాయకులు అధికారంలోకి వచ్చాక ఆల్మట్టి విషయంలో చే సిందేమీ లేదనీ చెప్పక తప్పదు. ఆంధ్ర పా లకుల వల్ల ఈ ప్రాంతం ఎడారిగా మా రిందని ఎద్దేవా చేసిన వాళ్ళు అధికారంలోకి వచ్చాక గత పదేళ్ల కాలంలో చేసిం దేమిటనేది ఆలోచించుకోవాలి. ఇవాళ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) వేదికల మీద మాట్లాడుతూ..

కర్ణాటక కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక ఆల్మట్టి డ్యా మ్ ఎత్తు పెంచి కిందికి నీళ్లు రాకుండా చే స్తుంటే ఇవాళ రాష్ట్రంలో సీఎంగా ఉన్న రే వంత్‌రెడ్డి ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడాన్ని అడ్డుకునే దమ్ము లేదా? గులాబీ దండు వెళ్లి అడ్డుకోవాలా? అంటూ సవాలు విసరడం విడ్డూరంగా ఉంది. ఈ సవాళ్లు ప్రతి సవాళ్ళు ప్రజల్ని సంతోషపెట్టడానికే తప్ప సమస్యలను పరిష్కరించడానికి పనికిరావన్నది జగమెరిగిన సత్యం.

తెలంగాణ ఉ ద్యమంలో మన నీళ్లు మనకే అం టూ ఆశ చూపించి ఉద్యమ పార్టీగా చెప్పుకున్న బీఆర్‌ఎస్ ఈ పదేళ్ళ కాలంలో ఆల్మట్టి విష యంలో ఏం చేశారనేది ఆలోచించుకోవా లి. ఇరిగేషన్ నిపుణులు, రైతు సంఘాలు వద్దని వారిస్తున్న వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం మీద ఖర్చు పెట్టి అదనంగా ఎక రం నీటిని అందివ్వకపోగా దక్షిణ తెలంగాణను అలాగే వదిలేశారు. బీఆర్‌ఎస్ పాల కులు తమ పదేళ్ల కాలంలో కృష్ణా నది మీద ఒక్క ప్రాజెక్టును కూడా కొత్తగా ఎం దుకు చేపట్టలేదో, వలస పాలమూరును ఎందుకు సస్యశ్యామలం చేయలేదన్నది ఆలోచించుకోవాల్సిన అవసరముంది.

చిత్తశుద్ధి అవసరం

ఆల్మట్టిపై సుప్రీంకోర్టు స్టే విధించిందని, దానిపై కొత్తగా మాట్లాడేందుకు ఏమీ లేదని మన రాష్ట్ర ప్రభుత్వం దాటేస్తుంది. అయితే పక్కనున్న కర్ణాటకలో అధికారంలో ఉంది కూడా తమ పార్టీయే కావ డంతో ఏం మాట్లాడలేకపోతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే ఈ సమస్యను సులభంగానే పరిష్కరించవచ్చు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. భారతదేశంలో అనేక మంది నీటి పారుదల ని పుణులు ఉన్నారు.

సుందరయ్య మొదలూ అనేక మంది ప్రజా నాయకులు సమగ్ర నీటి పంపిణీపై ఇప్పటికే అనేక సూచనలు చేశారు. ఇప్పుడు కావాల్సిందంతా వాటిని అమలు చేసే చిత్తశుద్ధి మాత్రమే. అయితే ప్రస్తుతమున్న కాంగ్రెస్ నాయకుల్లో ఇది లోపించిందేమోననిపిస్తుంది. పొరుగున వున్న కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు ఈ సమ స్యను మరింత సులభంగా పరిష్కరించుకునే వెసులుబాటు మన సర్కార్‌కు ఉం టుంది.

కానీ పాలకులకు సమస్యల మీద లబ్ధి పొందడమే తప్ప పరిష్కరించాలనే ఆలోచన కనిపించడం లేదనే చెప్పాలి. అయితే ఇటీవల రేవంత్ ప్రభుత్వం ప్రెస్‌మీట్ పెట్టి ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు ప్రతి పాదనలను సహించేది లేదని స్పష్టం చే సింది. కర్ణాటకలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆల్మట్టి ఎత్తు పెంపు విషయంలో రాజీ పడేది లేదని చెప్పడం కొసమెరుపు.

1969లో ఏర్పాటైన బచావత్ ట్రిబ్యునల్ కానీ, ఆ తర్వాత వచ్చిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కానీ ఏ రాష్ర్టం ఎంత వాడుకోవాలో అనేది తేల్చి చెప్పినప్పటికీ పాలకుల అధికార దాహం ఈ సమస్యలన్నింటికీ మూల కారణమవుతుం ది. ప్రజా ఉద్యమాలతోనే వీటికి పరిష్కారం దొరుకుతుందేమోననిపిస్తుంది. ఇ ప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ఆల్మట్టి ఎత్తు పెంపు విషయమై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది.. లేదంటే ఏదో ఒకనాడు పాలకులపై ప్రజలు తిరగబడతారనే విషయాన్ని గుర్తించాలి.

వ్యాసకర్త: మాజీ శాసన సభ్యురాలు