calender_icon.png 15 October, 2025 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒప్పందాలను గౌరవిస్తేనే అభ్యుదయం

15-10-2025 12:10:57 AM

పాలకుర్తి రామమూర్తి :

కృతస్య ప్రయహితాభ్యాముభయతః 

పరిపాలనం

యథా సంభాషితస్య చ నిబంధనస్యానువర్తనం...

(కౌటిలీయం - 7-----6)

రెండు పక్షాల వారూ పరస్పరమూ ప్రియములూ, హితములైన పనులు చేస్తూ, చేసుకున్న సంధి యొక్క నిబంధనలను, ఒప్పందాలను గౌరవించడమూ, అమలు చేయడం అవసరం. శత్రువుల వల్ల, చేసుకున్న సంధికి విఘాతం కలుగకుండా రక్షించుకోవడాన్ని ‘కృతశ్లేషణం’ అంటా డు, ఆచార్య చాణక్య. ఎవరితో స్నేహం చేయాలనే స్వేచ్ఛ పాలకులకు ఉంటుందే కాని పక్కన ఏ రాజ్యం ఉండాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ వారికి ఉండదు.

ఉదాహర ణకు భారతదేశానికి ప్రక్కన ఉండే దేశాలతో స్నేహం చేయాలా వద్దా నిర్ణయిం చుకునే స్వేచ్ఛ భారతదేశానికి ఉంటుందే కాని భారతదేశ సరిహద్దుల్లో ఎవరుండాలి, ఎవరుండకూడదనే స్వేచ్ఛ ఉండదు. అయితే వీలైన మేరకు పొరుగు వారితో సత్సంబంధాలు నెలకొల్పుకునే రాజ్యాలు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉన్నది.

రాజ్య నిర్వహణలో సమస్యలు బయటి వారితో రావచ్చు.. అంతర్గతంగా రావచ్చు. పొరుగువారితో సత్సంబంధాలు నెలకొల్పుకునే క్రమంలో ఇరు వర్గాలకు లాభసాటియైన సంధి జరగాలి. ఎదుటివా రు సంధి నియమాలు అతిక్రమిస్తే పరాక్రమాన్ని చూపాలి, అంటారు చాణక్య. 

అభిప్రాయ భేదాలు  

రెండు దేశాల మధ్య.. వ్యాపార వాణిజ్యాల అవగాహన, వ్యాపార లావాదేవీలు, వాటి నాణ్యతలు, విధించే పన్నులు, దేశ సరిహద్దులు, మానవ వలసలు, సాంస్కృతిక అవగాహనలు, రక్షణ సంబంధిత అంశాలు, ఉగ్రవాద సమస్యలు, ఆర్థికాంశాల్లో పోటీలు, నీటి వ్యవ హారాలు, వనరుల వినియోగా లు, చాలా కాలం నుంచి పరిష్కారం కాని అంశాలు.. ఇలా ఎన్నో సమస్యల వల్ల ఆయా దేశాల మధ్య తగాదాలు వచ్చే అవకా శం ఉంటుంది.

వాటిని ఇరుదేశాల నాయకులు కూర్చొ ని మాట్లాడుకొని ఒప్పందాలు చేసుకోవడం, ఆ ఒప్పందాల ను గౌరవిస్తూ.. తమ అస్తిత్వాన్ని, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడం వల్ల రెండు దేశాల ప్రజల మధ్య సయోధ్య కుదురుతుంది. శాంతి నెలకొంటుంది. అలాగే కార్పొరేట్ సం స్థల మధ్య సమస్యలు, భేదాభిప్రాయాలు రావచ్చు.. ఇతరులా సమస్యలను పెద్దవిగా చూపు తూ రెండు సంస్థల మధ్య చిచ్చురేపవచ్చు. దానితో చేసుకున్న ఒప్పందాల అమలుకు అవరోధం ఏర్పడవచ్చు.

వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. రెండు కార్పొరేట్ సంస్థలు సరైన అవగాహన కలిగి, స హకారం, సమన్వయం, తోడ్పాటు నందించుకోవడం వల్ల సంపద పెరగడమే కాక దే శం కూడా అభ్యుదయ మార్గంలో పయనిస్తుంది. అయితే వాటి మధ్య భావ వ్యక్తీక రణలో లోపాలు, పారదర్శకత లేకపోవ డం, అధికార లాలసత, నైతిక విలువ లు, సాంస్కృతిక పరిమితులు, ప్రభుత్వ నిర్ణయాల ప్రభావాలు..

ఇలాంటివి వాటి సయోధ్యపై నకారాత్మక ప్రభావాన్ని చూపవచ్చు. వీటిని సరిగా అవగాహన చేసుకో గలిగి.. సకాలంలో పరిష్కరించుకోగలిగితే శక్తివంతమైన, నిర్మాణాత్మకమైన వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించడం సాధ్యపడుతుంది. సంస్థల మధ్య అత్యాధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునే సం స్కారం నెలకొని వినియోగదారునికి ఉత్త మ సేవలను అందించే అవకాశం ఉం టుంది.

అంతర్గత సమస్యలు

దేశాల మధ్య సమస్యలను సకాలంలో పరిష్కరించుకోకుంటే.. అవి యుద్ధాలకు దారితీయవచ్చు.. సంక్షోభానికి కారణం కావచ్చు. అలాగే దేశంలో అంతర్గతంగా ఎదురయ్యే సమస్యలు దేశాన్ని అతలాకుతలం చేయవచ్చు.. శాంతిభద్రతలకు వి ఘాతం కలుగవచ్చు. ఒప్పందాలను ఉల్లంఘిస్తే పరాక్రమించడమే సమంజసం. అ లాగే ప్రగతిశీలమైన, ప్రేరణాత్మకమైన వ్యా పార సంస్థల మధ్య ఎదురయ్యే అం శాలు, సమస్యలు, భేదాభిప్రాయాలు ఆర్థి క సంక్షోభానికి దారి తీయవచ్చు.

అధికార లాలసత వల్ల సంస్థల మధ్య లేదా అంతర్గతంగా ఏర్పడే భేదాభిప్రాయాల కార ణం గా పెద్దపెద్ద వ్యాపార సామ్రాజ్యాలు కూలిపోతే ఎందరో ఉద్యోగులు ఉపాధిని కో ల్పోతారు.. స్టాక్ మార్కెట్‌లు పతనమౌతా యి. మదుపరులు నష్టపోతారు. దేశానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గుతుంది. వినియోగదారుని సేవలకు అవరోధం కలుగుతుంది. ఈ విషయంలో విలువలతో వార సత్వంగా ఎదిగిన సంస్థలు అప్రమత్తంగా ఉండాలి.

దా దాపు 156 సంవత్సరాల చరిత్ర కలిగి, జాతీయ భా వన, సామాజిక బాధ్యత, నైతిక వర్తన, నిబద్ధత, సమన్వయత, నాణ్యత, సృజనా త్మకత, వ్యాపార విలువలకు మారు రూపంగా నిలి చిన ‘టాటా’ సముదా యం.. గొప్ప బ్రాండ్ విలు వ కలిగిన కార్పొరేట్ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయతకు పెట్టిం ది పేరు. ఒకే గొడుగు కింద వివిధ ఉత్పత్తులను, వివిధ విభాగాలను స్వతంత్రంగా నిర్వహిస్తూ, దాదాపు 436 బిలియన్ డా లర్లు కాపిటలైజ్డ్ వ్యాపార సామ్రాజ్యంగా, 100కు పైగా దేశాల్లో వివిధ వ్యాపారాలతో విస్తరిస్తూ 30 లిస్టెడ్ కంపెనీలు..

మరికొన్ని లిస్ట్ కాని సంస్థలను నిర్వహిస్తున్న ‘టాటా’ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా లక్షా 15 వేల కన్నా ఎక్కువమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంత పెద్ద సంస్థలో టీ కప్పులో తుఫాను లాగా.. చిన్న అంతర్గతమైన అవగాహనా లోపాలు, భేదాభిప్రాయాలు బహిరంగ చర్చలకు దారి తీశాయి.

మిత్రులే శత్రువులుగా

నిజానికి వారసత్వంగా నడుపుతున్న సంస్థల్లో చిన్న, చిన్న సమస్యలు ఎదురవ్వ డం.. అందునా బయటివారి భాగస్వా మ్య మూ కలిగిన సమయంలో సాధారణ మే. తరాలు మారినప్పుడు నాయకుల ఆలోచనలు మారుతాయి, అవగాహనలు మా రుతాయి. ప్రాధాన్యతలు మారుతాయి. బాధ్యతారాహిత్యం రెండు వర్గాల మధ్య అధికార పంపిణీకి సంబంధించిన సమస్య ను సృష్టించింది. నాయకుల మధ్య పారదర్శకత లేకపోవడం వల్ల మిత్రులను శ త్రువులుగా మారుస్తుంది.

పెద్ద సంస్థల అ భ్యుదయంపై ప్రజల అ స్తిత్వం అధారపడి ఉంటుంది. ప్రభుత్వాల పరపతి ఆధారపడి ఉంటుంది. అందుకే ఆ సమస్య ప్రభుత్వం జోక్యం చేసుకునేంత వ రకు వెళ్ళిందని వింటున్నాము. ప్రభుత్వ మధ్యవర్తిత్వంతో సంస్థ సమస్యలకు పూర్తి పరిష్కారం లభించకున్నా.. తాత్కాలిక ఉపశమనం ల భించింది. అంతర్గత సమస్యల ను సానుకూలంగా సంస్థయే పరిష్కరించుకోవాలని ప్రభుత్వ పెద్దలు సూచించారు.

అవసరమై న సమయంలో సమస్యలకు కా రణమైన ట్రస్టీలను తొలగించాలని సూ చించారు. ఈ ఉదంతం కార్పొరేట్ ప్రపంచానికి అ ద్భుతమైన సందేశాన్ని ఇస్తున్నది. ఏ సంస్థయైనా దార్శనికత కలిగిన నాయకత్వంలో, బాధ్యతతో కూడిన దీర్ఘకాలిక ప్ర యోజనా లు లక్ష్యంగా, నైతిక విలువలతో కూడిన క ఠోరమైన పరిశ్రమతో, సామాజి క బాధ్యతగా విద్య, ఆరోగ్యం, పల్లెల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగితేనే  అభ్యుదయాన్ని సాధిస్తుంది. దానిని నిలుపుకోలేని అసమర్ధత సంస్థకే కాదు.. ప్ర భుత్వానికీ ప్రమాదకరమే.