15 April, 2026 | 11:10 AM

కేడీసీసీబీ చైర్మన్‌ను కలిసిన మద్దూర్ సర్పంచ్

27-12-2025 12:00 AM

అలంపూర్, డిసెంబర్ 26:  టీడీపీ సీనియర్ నేత కేడిసీసీబీ చైర్మన్ ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డిని మద్దూరు గ్రామ సర్పంచ్ ఇందిరా ఎల్లప్ప మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు శుక్రవారం కర్నూలు పట్టణంలోని విష్ణువర్ధన్ రెడ్డి నివాసంలో వారు కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా కేడిసిసిబి చైర్మన్ ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్ని రంగాల్లో  అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి మాజీ జడ్పిటిసి శ్రీనివాసులు, గ్రామస్తులు పాల్గొన్నారు.