calender_icon.png 27 December, 2025 | 3:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుంభస్థలం లాంటి పెద్ద గ్రామపంచాయతీల్లో గులాబీ జెండా ఎగిరింది

27-12-2025 12:00:00 AM

  1. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి..

నీళ్లు ఇవ్వడానికి చేతకాక క్రాప్ హాలీడే ఇస్తున్నారు..

రైతులు కష్టపడుతుంటే జిల్లా మంత్రి విహార యాత్ర చేస్తున్నాడు..

వనపర్తి, డిసెంబర్ 26 (విజయక్రాంతి): అధికార పార్టీ అహం, మద్యం, డబ్బల ముందు ఫోటి లో నిలబడి గులాబీ జెండా మెడలో వేసుకుని ప్రజాక్షేత్రంలో యుద్ధం చేసి  కుంభస్థలం లాంటి పెద్ద గ్రామ పంచాయతీ ల్లో గులాబి జెండా ఎగుర వేశారని ఎన్ని అడ్డంకులు సృటించిన రాష్ట్ర స్థాయి లో చరిత్ర సృష్టిచారు గోపాల్ పేట మండల ప్రజలు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

శుక్రవారం జిల్లా కేంద్రం లోని తన నివాస గృహం నుండి స్థానిక నాయకులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం రాజాపేట గ్రామ శివారులో గల జిల్లా పార్టీ కార్యాలయంలో నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు అభినందనలు తెలుపుతూ పాలమూరు నది జాలాల హక్కుల సాధనకై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వం మీద అధికారం లోకి వచ్చిన తరువాత రెండు నెలలోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని లక్షల మంది రైతులు యూరియా కోసం నిలబడ్డారని, ప్రభుత్వ  ఉద్యోగుల పదవి విమరణ తరువాత రావాల్సిన డబ్బు లు ఇవ్వలేదని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ లో 60 మంది విద్యార్థులు చనిపోయారు, 700 మంది రైతులు చనిపోయారని ఇవ్వని ప్రభుత్వ వైఫల్యంకు నిదర్శనమన్నారు. 

నీళ్లు అదించడానికి చేత కాక జూరాల ప్రాజెక్టు నుండి 45 రోజులు వరద నీరు వృధాగా సముద్రం లో కలిసిన తరువాత కే ఎల్ ఐ మోటార్లు ఆన్ చేసారని వరద నీరు వచ్చిన సమయంలో ఆన్ చేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. జూరాల ప్రాజెక్టు కు పైన గల ప్రభుత్వం తో మాట్లాడి గతంలో నీళ్లు అందించి క్రాప్ హాలీడే అనేది లేకుండా చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం వరద నీరు సముద్రం లోకి వెళ్లిన తరువాత కర్ణాటక తో మాట్లాడలేక క్రాప్ హాలిడే ప్రకటించారన్నారు. 

నీళ్లు లేక రైతులు కష్టపడుతుంటే ఇక్కడ ఉన్న జిల్లా మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి సోమశిలలో విహార యాత్ర చేస్తున్నాడని అయన విమర్శించారు.  వ్యక్తిగత పంచాయతీ లకు సర్పంచులు దూరంగా ఉండాలి అంతే తప్ప వ్యక్తిగత పంచాయతీలన్ని నెత్తిన వేసుకోవద్దని ప్రజలకు ఏది ఉపయోగమో అది చేయాలి మీరు చేసే పని మీదనే మీకు విలువ పెరుగుతుందన్నారు. 

గడిచిన రెండేళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టేడు మన్ను తీయలేదు..

ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు దిశగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లో భాగంగా తమ ప్రభుత్వం లో 90 శాతం పనులు పూర్తి చేసినప్పటికి మిగిలిన పనులను చేయకుండా గడిచిన రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తట్టేడు మన్ను కూడా తీయలేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు .

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 35 లక్షల ఎకరాలు ఉండగా అందులో కేవలం 10 లక్షల ఎకరాల్లో సాగు అవుతుందని అందులో 9 లక్షల ఎకరాలకు కే సి ఆర్ ప్రభుత్వం లో సాగు నీరును అందించడం జరిగిందని మిగిలిన ఎకరాలకు నీళ్లు అందించడానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కు రూపకల్పన చేసి రిజర్వాయర్లు, పంపింగ్ స్టేషన్లు పనులు చేయడం జరిగిందని మిగిలి పోయిన పనులను పూర్తి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. 

మనకు కృష్ణ నదిలో నికర జలాల్లో ఒక్క పాలమూరు కు 200 టి ఎం సి లు రావాలని కానీ ప్రాజెక్టు లలో 40 టి ఎం సి లు కూడా లేవన్నారు.  ఆంధ్రాలో చంద్రబాబు కింద పని చేసిన ఆదిత్య నాథ్ అధికారి తెలంగాణ కు నీళ్లు వద్దని చెప్పిన వ్యక్తి ని తెలంగాణ ప్రభుత్వ నీటి సలహా దారుడిగా గా ఇక్కడి సి ఎం పెట్టుకున్నారని కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న జల దోపిడీని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు.

జనవరి నెలలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ల కే సి ఆర్ సభలు సమావేశాలను నిర్వహించడం జరుగుతుందని అందుకు సంబందించి పార్టీ ఎ పిలుపునిచ్చిన ఉద్యమం కు అందరు తయారు అయ్యి ఉండాలని అందుకు గ్రామాల, మండల, నియోజకవర్గం, నాయకులతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు.  

సోలిపూర్, సవాయి గూడెం ఎన్నికల ఫలితాలపై కోర్టుకు వెళ్లాం..

ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సోలిపూర్, సవాయి గూడెం లో ముందుగా మనవాళ్ళు గెలిచారని అధికారులు చెప్పారు  కానీ తరువాత  కాంగ్రెస్ వాళ్లు గెలిచారని చెప్పారని దాని మీద కోర్టులో కేసు లు వేయడం జరిగిందన్నారు. త్వరలో నే తీర్పు వస్తుందన్నారు. అనంతరం శ్రీ రంగా పురం మండల కేంద్రానికి చెందిన వార్డు మెంబెర్ రాములు బిజెపి పార్టీ నుండి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు

పెట్టుబడి లేని వ్యాపారం అంటే ఒక్కటే విమర్శించడం.... మాజీ పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల చంద్ర శేఖర్ రెడ్డి 

ప్రస్తుత కాలంలో ఎ పని చేయాలన్న ఖర్చు తో కూడుకున్నది కానీ ఎలాంటి ఖర్చు, పెట్టుబడి లేకుండా ఉండే వ్యాపారం అంటే అది కేవలం ఇతరులను విమర్శించడం అని అవతలి వాళ్లు ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటారని వాళ్లకు తిట్లు మాత్రమే మిగులుతాయని మనం ఎవరిని తిట్టమని మనం చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందని మాజీ పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల చంద్ర శేఖర్ రెడ్డి అన్నారు.

మీ వల్ల జనాలకు మంచి జరగాలి ఆ దిశగా సర్పంచ్ లు పని చేయాలని   సర్పంచ్ లు చట్టం లో మీకు ఉన్న బాధ్యతలు ఏమిటి అధికారం ఏమిటి అనేది తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనుభవాని గడించాలని ప్రతి దానికి డబ్బు అవసరం లేదని మనసు పెట్టి ప్రజలోకి వెళ్ళితే ఆదరిస్తారని ఆయన వివరించారు.  పాత వరంగల్ ప్రస్తుత మహబూబాబాద్ లో బి ఆర్ ఎస్ అభ్యర్థులు  గెలిచిండు అని పత్రం ను తీసుకుని ఇంటికి వెళ్లిన తరువాత కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లుగా ఇచ్చారని వాటి మీద కోర్టు కు వెళ్లడం జరిగిందని అందుకు సంబందించి ప్రతి ఖర్చు కే సి ఆర్ పెట్టు కోవడం జరుగుతుందన్నారు.

గ్రామాలలో క్రమం తప్పకుండ గ్రామ సభలు పెట్టాలని ప్రతి అంశాన్ని రికార్డ్ లో పొందుపరాచాలని గ్రామ సభ పెట్టకుంటే  పంచాయతీ కార్యదర్శి ఒక లెటర్ పెట్టడం వల్ల సర్పంచులకు ఇబ్బంది కలుగుతుందన్నారు.  నాయకులు, కార్యకర్తలు రెండే లక్ష్యాలు ఒకటి కే సి ఆర్ ముఖ్యమంత్రి కావడం, రెండవది నిరంజన్ రెడ్డి అసెంబ్లీ లోకి పోవాలన్నారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తల మీద ఉంటుందన్నారు .

ఈ కార్యక్రమం లో నాగం తిరుపతి రెడ్డి, జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్, మాజీ ఎంపిపి కృష్ణ నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మండల అధ్యక్షులు మాణిక్యం, నాయకులు విజయ్, కురుమూర్తి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.