27-12-2025 12:00:00 AM
మహబూబ్ నగర్ టౌన్, డిసెంబర్ 26: ప్రతి విద్యార్థిని పట్టుదల చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ అన్నారు. శుక్రవారం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెడ్ క్రాస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చలి తీవ్రతను దృష్టి లో ఉంచుకొని వసతి గృహ విద్యార్థిని లకు రగ్గులు పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు.
విద్యార్థినిలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. చిన్నప్పటినుంచి సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. రగ్గులు అందుకున్న బాలికలు ఎంతగానో సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన బాలికల సంక్షేమా ధికారిణి అర్చన, జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త లయన్ అశ్విని చంద్రశేఖర్, తదితరులు ఉన్నారు.