calender_icon.png 12 August, 2025 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాపారుల మాయాజాలం!

12-08-2025 01:02:01 AM

లింకు ప్రొడక్టు పెడితేనే రిటైల్ దుకాణాలకు యూరియా 

మంచిర్యాల, ఆగస్టు 11 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో ఎరువుల హోల్‌సేల్ వ్యాపారుల మాయాజాలానికి రిటైల్ వ్యాపారులతో పాటు రైతులకు ఇక్కట్లు తప్ప డం లేదు. హోల్‌సేల్ వ్యాపారులు లింకు ప్రొడక్టు పెట్టనిదే రిటైల్ వ్యాపారులకు చేర డం లేదు. అధికారులు హోల్‌సేల్ వ్యాపారులకు ఎన్ని హెచ్చరికలు చేసినా పెడ చెవిన పెడుతున్నారు. మంచిర్యాల జిల్లాకు సోమవారం క్రిబ్ కో కంపెనీకి చెందిన యూరి యా వ్యాగన్ రాగా దానిని సొసైటీలకు 60 శాతం, ప్రైవేటుకు 40 శాతం వ్యవసాయ శాఖ అధికారులు కేటాయించారు.

హోల్‌సేల్ డీలర్లు వ్యాగన్ నుంచి రిటైల్ డీలర్లకు ఆర్‌ఓలు రాసి 10 నుంచి 12 టన్నుల యూరియా లోడ్‌కు లింక్‌గా క్రిబ్ కో కంపెనీకి చెందిన గంట మందులు, ఇతర ప్రొడ క్టులు బహిరంగంగానే అదే లారీలో లోడ్ చేసి అంటగడుతున్నారు. జిల్లాలో నాలుగు (మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, భీమిని) వ్యవసాయ డివిజన్‌లు ఉన్నాయి. డివిజన్ స్థాయిలో కొందరు అధికారులు వారికి అనుకూలంగా ఉన్న డీలర్లకే ఎరువులు అలా ట్ చేస్తున్నట్లు సమాచారం. సొసైటీలు, రిటై ల్ డీలర్లపై పెడుతున్న నిఘా హోల్ సేల్ డీలర్లపై పెట్టడం లేదు. అసలు హోల్ సేల్ దుకాణాలలో ఉన్న స్టాకు ఎంత, అది ఎక్కడికి వెళుతుంది, దానికి లింక్ పెడుతున్నారా! అనేదానిపై దృష్టి సారించడం లేదు.